For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: గిల్‌పై నిషేధం? - రూల్స్ ఏం చెబుతున్నాయి?

Shubman Gill Ban: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరబాద్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచులో గిల్ ఎలక్రిఫైయింగ్ నాక్ తో 76 పరుగులు చేశాడు. 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 76 పరుగులు చేశాడు. అయితే అతడు పరుగుల ఫైర్ మాత్రమే చూపలేదు.. తన ఔట్ విషయంలో ఎమోషనల్ ఫైర్ కూడా చూపించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పు బడుతూ.. ఫోర్త్ అంపైర్‌తో రూడ్ గా మాట్లాడుతూ అసహనం కూడా వ్యక్తం చేశాడు. ఈ విషయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

దీంతో ఇప్పుడు బీసీసీఐ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద గిల్ పై ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటారా అని క్రికెట్ అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. అతడిపై మ్యాచ్ నిషేధం విధిస్తారా అన్న అనుమానం కూడా అందరిలో నెలకొంది. అసలే ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోన్న వేళ.. నిజంగా గిల్ పై మ్యాచ్ నిషేధం విధిస్తే గుజరాత్ దూకుడుపై ఇది ప్రభావం చూపొచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

What is BCCI Rules Will Shubman Gill Face Ban for fighting With umpire in GT VS SRH match ipl 2025

అసలు గిల్ పై ఎలాంటి శిక్ష విధించొచ్చు?
బీసీసీఐ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. గిల్ లాగా మైదానంలో దురుసుగా ప్రవర్తిస్తే సదరు ఆటగాడిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటారు. మ్యాచ్ అఫీషియల్స్ లేదా అంపైర్స్ తో గొడవకు దిగితే.. మూడు లెవల్స్ లో ఒకదాని కింద తప్పును పరిగణిస్తారు.

  • లెవల్ 1.అంపైర్ తీర్పుపై అసంతృప్తిని వ్యక్తపరచడం.
  • లెవల్ 2: తీవ్రంగా లేదా మళ్లీ మళ్లీ అసంతృప్తిని వ్యక్తపరచడం.
  • లెవల్ 3 లేదా 4: అంపైర్లను దూషించినా లేదా బెదిరించేలా ప్రవర్తించడం.

లెవల్ 1లో వార్నింగ్ ఇవ్వడం లేదా మ్యాచు ఫీజులో 50 శాతం ఫైన్ విధించడం. అదే రెండో సారి చేస్తే 50 నుంచి 100 శాతం మ్యాచు ఫీజులో కోత విధించడం లేదంటే రెండు మ్యాచుల వరకు సస్పెన్షన్ విధించడం. అదే మూడు లేదా ఎక్కువ సార్లు తప్పు చేస్తే.. 8 మ్యాచుల నుంచి ఒక సీజన్ వరకు నిషేధం విధించొచ్చు.
లెవల్ 2లో మొదటి సారే 50 నుంచి వంద శాతం మ్యాచు ఫీజులో కోత లేదంటే రెండు మ్యాచుల వరకు నిషేధం. రెండో సారి చేస్తే 2 నుంచి 8 మ్యాచుల వరకు సస్పెన్షన్. మూడో సారి చేస్తే 1 నుంచి 5 సీజన్ల వరకు బ్యాన్.
లెవల్ 3లో 4 నుంచి 8 మ్యాచుల వరకు సస్పెన్షన్. రెండో సారి చేస్తే ఏడాది లేదా లైఫ్ టైమ్ నిషేషం.
లెవల్ 4లో 8 మ్యాచుల లేదా లైఫ్ టైమ్ బ్యాన్.

ఇప్పుడు గిల్ పాల్పడిన తప్పిదం చూస్తే.. అతడి తప్పును లెవల్ 1 లేదా లెవల్ 2 ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఎక్కువగా ఉంది. అదే మ్యాచ్ అధికారులు అతడి ప్రవర్తనను దురుసుగా లేదా బెదిరింపుగా భావిస్తే మాత్రం లెవల్ 3 ఉల్లంఘనగా పరిగణించవచ్చు. చూడాలి మరి గిల్ ప్రవర్తనపై ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ రిఫరీ సమీక్ష జరిపి ఏమని ప్రకటన చేస్తారో. హెచ్చరిక జారీ చేయడం లేదా ఫైన్ విధిస్తే ఓకే గానీ, మ్యాచ్ నిషేధం లాంటిది చేస్తే గుజరాత్ కు పెద్ద ఎదురుదెబ్బే. కాగా, జీటీ తన తర్వాతి మ్యాచును మే6న ముంబైతో ఆడనుంది.

Story first published: Saturday, May 3, 2025, 12:29 [IST]
Other articles published on May 3, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+