సూపర్ ఓవర్ అంటే ఏమిటి? అంతర్జాతీయ క్రికెట్‌లో ఎప్పుడు ప్రవేశపెట్టారు!

హైదరాబాద్: 'బౌండరీ రూల్'తో ఇంగ్లాండ్ తొలిసారి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. లార్డ్స్ వేదికగా జులై 14న న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించి ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ప్రధాన స్కోరు సమం కావడంతో విజేత ఎవరో నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఓడించారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అయితే, సూపర్ ఓవర్‌లో కూడా రెండు జట్ల సమానంగా పరుగులు చేయడంతో 'బౌండరీ రూల్' ప్రకారం ఇంగ్లాండ్‌ను విజేతగా నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఈ సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ సైతం ఆరు బంతుల్లో వికెట్ నష్టపోయి అదే 15 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. చివరకు బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించారు.

బౌండరీ రూల్ విధానంపై విమర్శలు
దీంతో ఐసీసీ బౌండరీ రూల్ విధానంపై అటు అభిమానులతో పాటు ఇటు మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు సూపర్ ఓవర్ అంటే ఏమిటి? దానిని క్రికెట్‌లో ఎప్పుడు ప్రవేశపెట్టారో ఒక్కసారి చూద్దాం. సూపర్ ఓవర్ పద్ధతిని 2008లో తొలిసారిగా టీ20ల్లో ప్రవేశపెట్టారు.

బౌల్ ఔట్ పద్దతి ద్వారా విజేత
అంతకుముందు అంతర్జాతీయ టీ20ల్లో మ్యాచ్ టై అయితే బౌల్ ఔట్ పద్దతి ద్వారా విజేతను నిర్ణయించేవారు. ఈ పద్దతిలో ఒక్కో జట్టు నుంచి ఐదుగురు బౌలర్లు ఐదు బంతులతో వికెట్లను పడగొట్టాల్సి ఉంటుంది. 2007 టీ20 ప్రపంచకప్‍లో భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టై అవడంతో ఈ పద్ధతినే అవలంభించారు.

ఐసీసీ నిబంధన 16.9.4డి ప్రకారం
అయితే, ఆ తర్వాత ఈ రూల్ మారింది. ఐసీసీ నిబంధన 16.9.4డి ప్రకారం ఒక మ్యాచ్‌లో తలపడిన రెండు జట్ల స్కోర్లు సమానమైనప్పుడు విజేతను నిర్ణయించడం కోసం సూపర్ ఓవర్ నిబంధనను తీసుకొచ్చారు. సూపర్ ఓవర్‌ను ఒక ఓవర్ ఎలిమినేటర్ అని కూడా పిలుస్తారు. సూపర్ ఓవర్‌లో ఇరు జట్లు ఆరు బంతులనే ఆడతాయి.

ఇరు జట్ల ఒకే విధమైన ఫీల్డింగ్ నిబంధనలతో
బౌలింగ్ టీమ్‌కు సంబంధించి ఈ ఆరు బంతులను ఒక బౌలర్ వేస్తాడు. అదే బ్యాటింగ్ జట్టు నుంచి తుది జట్టులో ఎవరైనా దిగొచ్చు. అంతకముందు జరిగిన ఇన్నింగ్స్‌లో ఔటైన బ్యాట్స్‌మెన్ కూడా ఈ సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగొచ్చు. ఇరు జట్ల ఒకే విధమైన ఫీల్డింగ్ నిబంధనలతో ఆరు బంతులను ఆడతాయి.

డీఆర్ఎస్ కూడా
డెసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్ఎస్) కూడా అమల్లో ఉంటుంది. ఇరు జట్లూ చెరొక రివ్యూని తీసుకునేందుకు అనుమతి ఉంది. రెండో ఇన్నింగ్స్ ఆడిన జట్టు సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగుతుంది. సూపర్ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోతే ఇన్నింగ్స్ అంతటితో ముగుస్తుంది. సూపర్ ఓవర్‌లో ఏ జట్టు అయితే అత్యధిక పరుగులు చేస్తుందో ఆ జట్టే విజేతగా నిలుస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications