Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒకవేళ ఇండియా-ఆసీస్ మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది?

మొహాలీ: టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు మార్చి 27న ఆదివారం తలపడేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

మొహాలీలోని పిసిఏ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇండియా మ్యాచ్ జరగనుంది. గ్రూప్-2లో న్యూజిలాండ్ టాపర్ ఉండగా.. సెమీ ఫైనల్లో స్థానం కోసం ఈ రెండు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచులో ఏ జట్టు ఓడినా ఆ జట్టు టోర్నీ నుంచి నిష్ర్కమించే అవకాశాలున్నాయి.

ఇండియా, ఆస్ట్రేలియాలు చెరో 4 పాయింట్లతో సమాన స్థితిలో ఉన్నాయి. దీంతో ఏ జట్టు గెలిచి సెమీస్ చేరుతుందోననే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొని ఉంది. అయితే, ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారి మ్యాచ్ రద్దయితే మాత్రం చెరో 1 పాయింట్ వచ్చే అవకాశం ఉంది. ఇది టీమిండియాకు నష్టమే.

What happens if India-Australia World T20 'quarter-final' is washed out?

నెట్ రన్‌రేట్ ఎక్కువగా నమోదు చేసిన ఆస్ట్రేలియా సెమీస్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు లేకపోలేదు. ఇదే భారత అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. వర్షం రావొద్దని కోరుకుంటున్నారు. ఏప్రిల్ 3న కోల్‌కతాలో జరిగే ఫైనల్ మ్యాచ్ కు మినహా ఇతర మ్యాచులకు రిజర్వు డే లేకపోవడంతో మళ్లీ మ్యాచ్ ఆడించే అవకాశం లేదు.

ప్రస్తుతం ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ +0.440(టేబుల్లో రెండో స్థానంలో ఉంది) ఉండగా, టీమిండియా -0.546(3వ స్థానం) రన్ రేటు నమోదు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే చెరో పాయింట్లతో 5 పాయింట్లకు చేరుకుంటాయి. దీంతో స్టీవ్ స్మిత్ టీం టోర్నమెంటులో స్థానం ఖరారు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో అభిమానులు వరుణ దేవుడ్ని వేడుకుంటున్నారు రావొద్దని.

సమాన పాయింట్లతో సెమీ ఫైనల్స్ చేరాలంటే..

సూపర్ లీగ్ లో సమాన పాయింట్లతో ఉంటే ఈ క్రింది విధంగా సెమీస్ జట్టును నిర్ణయిస్తారు

1. సెకండ్ రౌండ్లో ఎన్ని ఎక్కువ విజయాలు
2. సెకండ్ రౌండ్ విజయాలతోపాటు రన్ రేటు
3. రెండు అంతకంటే ఎక్కువ జట్లు సమానా పాయింట్లతో ఉంటే హెడ్ టు హెడ్ మ్యాచ్ నిర్వహిస్తారు

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+