Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు.. ప్రియాంకరెడ్డి హత్యాచార ఘటనపై కోహ్లీ దిగ్భ్రాంతి!!

What happened in Hyderabad is absolutely shameful: Virat Kohli on Telangana doctor Priyanka Reddy rape-murder case

ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నటీ డాక్టర్‌ ప్రియాంకా రెడ్డి హత్యాచార ఘటనపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన జరగడం ఎంతో సిగ్గుచేటు అని పేర్కొన్నారు. శంషాబాద్‌లో ప్రియాంక రెడ్డిని ఇద్దరు లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు క్లీనర్లు సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.

కోహ్లీ దిగ్భ్రాంతి:

కోహ్లీ దిగ్భ్రాంతి:

ప్రియాంక రెడ్డి మరణం యావ‌త్ దేశాన్నే కుదిపేసింది. నిర్భ‌య ఘ‌ట‌న త‌ర్వాత మళ్లీ అంత దారుణ‌మైన ఘ‌ట‌న ఇదేనని అంటున్నారు. నిందితులను క‌ఠినంగా శిక్షించాల‌ని దేశ వ్యాప్తంగా ఆందోళ‌న చేస్తున్నారు. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు కూడా ఈ పాశ‌విక అత్యాచారాన్ని ఖండిస్తున్నారు. తాజాగా విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా త‌న బాధ‌ని వ్య‌క్త‌కరించారు.

ఈ ఘటన సిగ్గుచేటు:

'హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు. సమాజంలో మనం అందరం బాధ్యత తీసుకుని ఇలాంటి అవమానవీయ ఘటనలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది' అని కోహ్లీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ ఘటనను ఖండించారు.

జంతువులు అంటే చాలా ఇష్టం:

జంతువులు అంటే చాలా ఇష్టం:

ప్రియాంక రెడ్డి గురించి ఆమె మామ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'ప్రియాంకకు జంతువులు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో మెడిసిన్‌లో సీటు వచ్చినా.. వెటర్నటీ కోర్సు చదివింది. చిన్నప్పటి నుంచి కుక్కలు, ఆవులు, గుర్రాలకు ఆహారం తినిపించేది. కొన్ని జంతువులను పెంచుకోవాలనుకుంది. కానీ.. ఇల్లు చిన్నగా ఉండడం వల్ల అది కుదరలేదు' అని తెలిపారు.

మూడేళ్ల క్రితం జాబ్‌:

మూడేళ్ల క్రితం జాబ్‌:

'ప్రియాంకకు మూడేళ్ల క్రితం జాబ్‌ రావడంతో కుటుంబాన్ని శంషాబాద్‌కు షిఫ్ట్‌ చేసింది. ఆన్‌లైన్‌లో కొత్త వంటకాలను చేయడం, జంతువులను ప్రేమించడం, పుస్తకాలు చదవడం, కుటుంబంతో సమయం గడపడం అంటే ఆమెకు చాలా ఇష్టం. సంప్రదాయ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తాము పిల్లలను పద్ధతిగా పెంచాం' మామ ప్రియాంక అని వివరించారు.

Story first published: Sunday, December 1, 2019, 10:58 [IST]
Other articles published on Dec 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+