మంచిది కాదు: బాటిళ్లు విసరడంపై సచిన్ అసంతృప్తి
కొచ్చి: కటక్‌లో ప్రేక్షకుల దుష్ప్రవర్తన క్రికెట్‌కు మంచిది కాదని భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ అన్నాడు. ఇలాంటి ఘటనలు జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయన్నాడు.
'కటక్‌లో మ్యాచ్ సందర్భంగా జరిగిన ఘటన ఆటకు కచ్చితంగా మంచిది కాదు. ఇంతకుముందు కూడా ఇలా జరిగింది. మనం తప్పుల నుంచి నేర్చుకోవాలి. మనందరికీ ఆటంటే చాలా ఇష్టం. కొన్నిసార్లు నిరాశ కలుగుతుంది. అసహనం వస్తుంది. వాటిని వ్యక్తీకరించడానికి ఇతర మార్గాలున్నాయి. మన భావోద్వేగాలను చూపించడానికి కటక్‌లోలా చేయడం మాత్రం సరికాదు' అని సచిన్ అన్నాడు.

'కటక్ ఘటన గురించి ఆలోచించమని, పరిణతిని ప్రదర్శించమని అభిమానులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా' అని సచిన్ పేర్కొన్నాడు.
కాగా, ఐసీసీ నియమావళికి విరుద్ధంగా మైదానంలోకి నీళ్ల బాటిళ్లు తెచ్చుకునేందుకు ప్రేక్షకులకు ఎందుకు అనుమతించారో చెప్పాలని ఓసీఏ (ఒడిశా క్రికెట్ సంఘం)ను బీసీసీఐ ప్రశ్నించింది.
వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో మానవతా దృక్పథంతో అనుమతించామని, మరోసారి అలా చేయమని ఓసీఏ వివరణ ఇచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications