Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏం తింటావ్ భయ్యా.. మియా భాయ్ ఫిట్‌నెస్ రహస్యం ఇదే..!

Mohammed Siraj: ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీని 2-2తో టీమిండియా డ్రా చేసింది. ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఒకడు. మహ్మద్ సిరాజ్ వరుసగా 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. చివరి మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సాధారణంగా ఫాస్ట్ బౌలర్లకు ఫిట్‌నెస్ అనేది ఒక పెద్ద సవాలు. ఈ నేపథ్యంలో సిరాజ్ వరుసగా ఇన్ని మ్యాచ్‌లు ఆడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సిరాజ్ ఫిట్‌నెస్ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని అభిమానులు, క్రికెట్ నిపుణులు ఆసక్తి చూపిస్తున్నారు. దీనిపై సిరాజ్ సోదరుడు ఇస్మాయిల్ వివరాలు వెల్లడించారు.

కెన్నింగ్‌టన్ ఓవల్ టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత మహ్మద్ సిరాజ్ సోదరుడు ఇస్మాయిల్ మాట్లాడుతూ, "సిరాజ్ జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటాడు. తన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కూడా బిర్యానీని తక్కువగా తింటాడు" అని తెలిపారు. ఈ కఠినమైన డైట్ ప్లాన్, క్రమశిక్షణే సిరాజ్ అద్భుతమైన ఫిట్‌నెస్‌కు ప్రధాన కారణమని తెలుస్తోంది.

What Does Mohammed Siraj Eat The Secret Behind His Fitness Revealed by His Brother

చిన్ననాటి నుంచే అంకితభావం
ఇస్మాయిల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరాజ్ చిన్ననాటి గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సిరాజ్‌కు చిన్ననాటి నుంచే పట్టుదల, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. అతను 2015 వరకు లెదర్ బాల్‌తో క్రికెట్ ఆడలేదు. టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా ఓటమిని అంగీకరించేవాడు కాదు. సిరాజ్ తన ప్రేరణ కోసం ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డోను ఆదర్శంగా తీసుకుంటాడు. ఇంట్లో 'బిలీవ్' అనే పోస్టర్ కూడా ఉంది. ఇది రొనాల్డో పట్టుదలను సూచిస్తుంది. కెరీర్ ప్రారంభంలో ముఖ్యంగా 2018 ఐపీఎల్‌లో సిరాజ్ ప్రదర్శన అంత బాగా లేనప్పుడు, విరాట్ కోహ్లీ అతనికి చాలా మద్దతుగా నిలిచాడు. కోహ్లీ ప్రోత్సాహం సిరాజ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. భారత్ విజయం, సిరాజ్ ప్రదర్శన తమ కుటుంబానికి రెండింతల ఆనందాన్ని ఇచ్చాయని ఇస్మాయిల్ తెలిపారు. ఈ వివరాలు సిరాజ్ కేవలం శారీరక ఫిట్‌నెస్‌తోనే కాకుండా, మానసికంగా కూడా ఎంత దృఢంగా ఉన్నాడో తెలియజేస్తున్నాయి.

Story first published: Tuesday, August 5, 2025, 10:56 [IST]
Other articles published on Aug 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+