Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డ్రింక్స్ బ్రేక్‌లో క్రికెటర్లు ఏం తాగుతారు.. వీడిన రహస్యాలు!

క్రికెట్ మ్యాచ్‌లో డ్రింక్స్ బ్రేక్‌లో క్రికెటర్లు ఏం తాగుతారు? లంచ్ బ్రేక్‌లో ఏం తింటారు? టీ బ్రేక్‌లో నిజంగా టీ తాగుతారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని అభిమానులు తరచుగా ఆసక్తిగా చూపుతుంటారు. ఇప్పుడు వారి ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఇంగ్లండ్ ఆటగాడు ఓలీ పోప్ బ్రేక్స్ సమయంలో తన ఆహారపు అలవాట్లను వెల్లడించారు. భారత్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసి తన జట్టును గెలిపించడంలో ఓలీ పోప్ కీలక పాత్ర పోషించాడు.

డ్రింక్స్ బ్రేక్, లంచ్ బ్రేక్‌లో ఆహారం
27 ఏళ్ల ఓలీ పోప్ ఇంగ్లండ్ బెస్ట్ బ్యాటర్లలో ఒకడు. ఓలీ పోప్ ఇటీవల స్కై స్పోర్ట్స్‌తో ఓలీ పోప్ మాట్లాడుతూ.. మ్యాచ్‌ల సమయంలో లంచ్ బ్రేక్ లేదా టీ బ్రేక్‌లో ఏం తింటాడో వెల్లడించారు. ఓలీ పోప్ మాట్లాడుతూ.. "నేను సాధారణంగా చికెన్, చేపలు లేదా పాస్తా తినడానికి ఇష్టపడతాను. నాకు తగినంత శక్తి లభించేలా తింటాను. కానీ ఇది సమయం, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. నేను బ్యాటింగ్ చేస్తుంటే చాలా తక్కువ తింటాను.అప్పుడు ఎక్కువ తినాలనిపించదు. అప్పుడు నేను ప్రొటీన్ షేక్, ఒక అరటిపండు తింటాను. ఒకవేళ నేను రోజంతా బ్యాటింగ్ చేస్తుంటే, రోజు చివర్లో పెద్దగా ఏమీ తినను, ఎందుకంటే అప్పుడు తినాలనిపించదు. రోజు చివర్లో శక్తి కోసం ఏదైనా కొద్దిగా తినాలి అంతే." అని ఓలీ పోప్ వెల్లడించాడు.

What Do Cricketers Drink During Breaks Ollie Pope Reveals

టీ బ్రేక్‌లో టీ తాగుతారా?
టీ బ్రేక్ సమయంలో నిజంగా టీ తాగుతారా అనే ప్రశ్నకు ఓలీ పోప్ ఇలా సమాధానమిచ్చాడు. "కొంతమంది (టీ) తాగుతారు. నేను సాధారణంగా కాఫీ తీసుకుంటాను. కొన్నిసార్లు వర్షం కారణంగా ఆలస్యం అయినప్పుడు నేను ఒక టీ తాగుతాను." అని ఓలీ పోప్ తెలిపాడు. ఓలీ పోప్ సమాధానం ద్వారా ఆటగాళ్లకు నిర్ణీత మెనూ అంటూ ఏమీ ఉండదని కూడా స్పష్టమైంది. ఆటగాళ్ళు తమకు నచ్చిన విధంగా, పరిస్థితులకు అనుగుణంగా ఏమి తినాలో లేదా తాగాలో నిర్ణయించుకుంటారు. అయితే ప్రతి బ్రేక్‌లో డీహైడ్రేషన్ నుండి బయటపడటానికి ఏదైనా తీసుకోవాలని మాత్రమే నిర్ధారించుకుంటారు. అందుకే చాలా మంది ఆటగాళ్ళు బ్రేక్‌లో ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు.

Story first published: Sunday, July 20, 2025, 14:31 [IST]
Other articles published on Jul 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+