Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

18కే ఆలౌట్: క్రికెట్‌లో సరికొత్త రికార్డు నమోదు, 61ని ముగిసిన మ్యాచ్

What A Bizarre Cricket Match - A Team All Out For 18 & Target Chased Down In Just 12 Minutes!

హైదరాబాద్: ఇంగ్లాండ్‌లో షెపర్డ్ నీమే కెంట్ క్రికెట్ లీగ్‌ ఓ సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ లీగ్‌లో క్రికెట్ చరిత్రలో ఇంతకమునుపెన్నడూ నమోదుకాని సరికొత్త రికార్డు నమోదైంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీలో ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని ఓ జట్టు కేవలం 12 నిమిషాల్లోనే ఛేదించింది.

దీంతో మ్యాచ్ కేవలం 61 నిమిషాల్లోనే ముగిసిపోయింది. 152 ఏళ్ల ఇంగ్లాండ్ క్లబ్ చరిత్రలో నమోదైన అత్యల్ప స్కోరుగా ఇది నమోదైంది. లీగ్‌లో భాగంగా బెకన్హమ్, బెక్స్‌లీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బెకన్హమ్ జట్టు కేవలం 18 పరుగులకే ఆలౌటైంది.

49 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసిన ఆ జట్టులో ఐదుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్‌గా వెనుదిరిగారు. అలెగ్జాండర్ సెన్(4), విలియమ్ మాకికార్(4), లెనాక్స్(4), జాన్ మాల్కమ్(1), అసద్ అలీ(1), జునైద్ నాడార్(1) ఇలా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.

ఏ ఒక్క ఆటగాడు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ముగ్గురు బ్యాట్స్‌మెన్ చేసిన నాలుగు పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. కాగా, బెక్స్‌లీ జట్టు బౌలర్ కాలమ్ మాక్‌లీడ్ ఆరు ఓవర్లు వేసి ఆరు వికెట్లు తీయగా.. జాసన్ బెన్ 5.2 ఓవర్లలో నాలుగు వికెట్లు తీశాడు.

బెకన్హమ్ జట్టు మొదటి వికెట్ 5 పరుగుల వద్ద కోల్పోగా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిగతా బ్యాట్స్‌మెన్ పేకమేడల్లా పెవిలియన్‌కు చేరారు. కేవలం 9 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జట్టు స్కోరు 12 పరుగులు కాగానే మరో రెండు వికెట్లు కోల్పోయింది.

15, 17, 18 పరుగుల వద్ద మరో మూడు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బెక్స్‌లీ జట్టు 3.3 ఓవర్లలో నిర్దేశిత లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. క్రిష్టోఫర్ లాస్(4), ఎయిడెన్ గిగ్స్(12) మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడటంతో బెక్స్‌లీ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు.

Story first published: Tuesday, July 24, 2018, 15:48 [IST]
Other articles published on Jul 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+