For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీ.. కింగ్‌లా ఉండాలన్న ద్రవిడ్ మాటలు గుర్తుకు చేసుకో..'

Actor Siddharth Lashes Out @ Virat Kohli's ‘Leave India’ Comment | Oneindia Telugu
What an idiotic set of words: Actor Siddharth blasts Kohli over leave India comment to fan

హైదరాబాద్: కెప్టెన్ కోహ్లీ.. పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన యాప్‌లో అభిమానిపై చేసిన వ్యాఖ్యలు రెండ్రోజులుగా విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే. ఇక కోహ్లీపై విమర్శలు గుప్పించే సెలబ్రిటీల స్థానంలో భోగ్లేతో పాటుగా నటుడు సిద్ధార్థ్ కూడా చేరిపోయాడు. గతంలో ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. విమర్శలు చేశాడు.

నీకు ఈ దేశం సరైంది కాదు

నీకు ఈ దేశం సరైంది కాదు

‘నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు. దేశం విడిచి ఎక్కడికైనా వెళ్లిపో. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలు మాత్రమే నీకు సరైనవి. ఈ దేశంలో ఉంటూ పరాయి దేశాలపై నీకు ప్రేమ చాలానే ఉంది' అని కోహ్లీ ధ్వజమెత్తాడు. తనను అభిమానించనంత మాత్రాన అతడిపై కోపం లేదని, భారత్‌లో ఉంటూ ఇండియన్ ప్లేయర్ల ఆటతీరును విమర్శించడం సరికాదని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ‘నీకు ఈ దేశం సరైంది కాదు' అని బదులిచ్చాడు.

కెప్టెన్ నుంచి తెలివి తక్కువ వ్యాఖ్యలు

‘కొహ్లీ నీకు ఇదే సరైన సమయం. నువ్వు కింగ్ కొహ్లీగా ఉండాలనుకున్నా, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలపై స్పందించాలన్నా ద్రవిడ్ చెప్పిన మాటలను నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. టీమిండియా కెప్టెన్ నుంచి ఎంత తెలివి తక్కువ వ్యాఖ్యలు వచ్చాయి' అని సిద్దార్థ్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా గతంలో ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలను కూడా సిద్దార్థ్ ప్రస్తావించాడు.

భారతీయ సినిమాలు సాగతీతగా

భారతీయ సినిమాలు సాగతీతగా

‘నేను భారతీయ సినిమాలు చూడను. అవి చాలా సాగతీతగా ఉంటాయి. నాకు హాలీవుడ్ సినిమాలంటే ఇష్టం. నేను కేవలం బాలీవుడ్ సినిమాలే చూస్తా. దక్షిణాది సినిమాలు చాలా ఫన్నీగా ఉంటాయి. నేను సినిమాలు చూడను. టైమ్ వేస్ట్.. వంటి వ్యాఖ్యలు మనం వింటూ ఉంటాం. అలాంటి వాటిని వినాలి. వాటితో పాటే వెళ్లాలి.

భారత ఆటగాళ్ల కంటే విదేశీ క్రికెటర్లనే

భారత ఆటగాళ్ల కంటే విదేశీ క్రికెటర్లనే

యాప్ ప్రమోషన్ కోసం ఓ వీడియో పోస్టు చేశాడు. దీనిపై స్పందిస్తూ ఓ క్రికెట్‌ ప్రేమికుడు భారత క్రికెటర్లపై కామెంట్లు చేశాడు. ప్రస్తుత భారత ఆటగాళ్ల కంటే తాను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్లనే ఎక్కువ ఇష్టపడతానని అన్నాడు. ఈ వ్యాఖ్యలు విరాట్‌‌కు చాలా కోపం తెప్పించాయి. దీంతో ఆ అభిమానికి ఘాటుగా సమాధానమిచ్చాడు.

Story first published: Friday, November 9, 2018, 10:21 [IST]
Other articles published on Nov 9, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+