హామిల్టన్: ప్రపంచ కప్‌లో భాగంగా గ్రూప్ బీలో ఉన్న భారత క్రికెట్ జట్టు దూసుకుపోతోంది. మంగళవారం నాడు ఐర్లాండ్ జట్టు పైన గెలిచి ధోనీ సేన పలు రికార్డులు సృష్టించింది. వన్డే ఇంటర్నేషనల్‌లో ధోనీ ఎన్నో రికార్డులు నెలకొల్పుతున్నాడు. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్‌గా, సారథిగా ధోనీ సాధించిన రికార్డ్‌లు...
ఐసీసీ అత్యున్నత మూడు ట్రోఫీలు సాధించింది ధోనీ నేతృత్వంలోనే (వరల్డ్ ట్వంటీ 20, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ కప్)
ప్రపంచ కప్‌లో వరుసగా తొమ్మిది మ్యాచ్‌లు గెలిపించి రికార్డ్ సృష్టించాడు. ధోనీ తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిపించాడు. గతంలో గంగూలీ పేరిట ఈ రికార్డ్ ఉంది. గంగూలీ 8 మ్యాచులలో భారత్‌ను గెలిపించాడు.
మొత్తంగా ప్రపంచ కప్‌లో ఇది రెండోసారి అత్యుత్తమం. గతంలో క్లైవ్ లాయిడ్ నేతృత్వంలో వెస్టిండీస్ తొమ్మిది మ్యాచుల్లో గెలిచింది. క్లీవ్ లాయిడ్‌తో సమానంగా ధోనీ నిలిచాడు.
ప్రపంచ కప్‌లో ధోనీ నేతృత్వంలో అత్యధిక విజయాలు - 12. 1983, 1987లలో కపిల్ దేవ్ 11 మ్యాచులలో గెలిపించాడు.

ఆస్ట్రేలియాలో ట్రై సిరీస్ గెలిపించిన తొలి భారత సారథి ( కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ 2008)
విదేశాల్లో అత్యధిక విజయాల్లో ధోనీ నేతృత్వంలో భారత్ 59 మ్యాచుల్లో గెలిచింది. గతంలో గంగూలీ పేరిట (58) రికార్డ్ ఉంది.
323 అవుట్లతో వికెట్ కీపర్‌గాను రికార్డ్ సృష్టించాడు. 238 క్యాచులు, 85 స్టంప్‌లు.
భారత జట్టు సారథిగా ధోనీ 175 మ్యాచ్‌లు. గతంలో అజహరుద్దీన్ పేరిట (174) ఉంది.
అత్యధిక విజయాలు అందించిన సారథి ధోనీ - 98 విజయాలు
వికెట్ కీపర్‌గా ప్రపంచంలోనే 175 మ్యాచుల రికార్డ్
వికెట్ కీపర్‌గా అత్యధిక స్కోర్ చేసిన బ్యాట్స్‌మెన్ ధోనీ. 183 నాటౌట్.
ఐసీసీ ఓడీఐ టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో 8సార్లు. ఐదుసార్లు సారథిగా.
ఓ వన్డే మ్యాచ్‌లో ఎక్కువ క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్ - 6
ఐసీసీ ఓడీఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా 2008, 2009లో
ఆటల్లో ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ధోనీని 2007-08లో వరించింది.
2013లో ఐసీసీ పీపుల్స్ ఛాయిస్ అవార్డ్
బ్రిటన్‌కు చెందిన డీ మోంట్‌ఫోర్ట్ యూనివర్సిటీ 2012లో డాక్టరేట్ ఇచ్చింది.
లెఫ్టినెంట్ కల్నల్ హోదాతో ఆర్మీ గౌరవించింది.
ఓడీఐలో ధోనీ.....
పూర్తి పేరు - మహేంద్ర సింగ్ ధోనీ, పుట్టినది - జూలై 7, 1981, వన్డేలు - 259, పరుగులు - 8,343, సగటు - 52.14, సెంచరీలు - 9, అర్ధ సెంచరీలు - 56, మొదటి వన్డే.. బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్‌లో, డిసెంబర్ 23, 2004లో, మొదటి వన్డే సారథిగా.. ఆస్ట్రేలియాతో బెంగళూరులో, సెప్టెంబర్ 29, 2007 (వర్షం కారణంగా అప్పుడు ఫలితం రాలేదు)