Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అద్భుతమైన క్యాచ్‌తో అలరించిన డుప్లెసిస్ (వీడియో)

What. A. Catch! Faf Takes a Screamer as Steyn Sends Short Packing

హైదరాబాద్: వార్మప్ మ్యాచ్‌లో ఇమ్రాన్ తాహిర్ పట్టిన క్యాచ్ ఓ విశేషంగా మిగిలితే.. తొలి వన్డేలో సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ పట్టిన క్యాచ్ అదే స్థాయిలో అభిమానులు మన్ననలు పొందింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. సూపర్‌మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు.

డేల్‌ స్టేయిన్‌ రీఎంట్రీని ఘనంగా

ఆసీస్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో చోటుచేసుకున్న ఈ అద్భుత ఫీట్‌కు మైదానంలోని ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యానికి లోనై మైమరిచిపోయారు. ఈ మ్యాచ్‌తో పేసర్‌ డేల్‌ స్టేయిన్‌ రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. డుప్లెసిస్ వేసిన రెండో ఓవర్‌లోనే రెండు కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్‌ పతనాన్ని శాసించాడు. తొలుత ట్రావిస్‌ హెడ్‌ను ఔట్‌ చేసిన స్టెయిన్‌ అనంతరం క్రీజులోకి వచ్చిన డీఆర్సీ షార్ట్‌ను డుప్లెసిస్‌ అద్భుత ఫీల్డింగ్‌తో డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు.

డీఆర్సీ షాట్‌ భారీ షాట్‌కు యత్నించగా

స్టెయిన్‌ వేసిన ఫుల్‌ లెంగ్త్‌ను డీఆర్సీ షాట్‌ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. ఆ బంతి బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకుని గాల్లోకి లేచింది. సెకండ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న డుప్లెసిస్‌ అంతే వేగంతో సూపర్‌ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి క్యాచ్‌ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో సఫారీ బౌలర్లు పెహ్లుక్వాయో 3, ఎంగిడి, స్టెయిన్‌, తాహిర్‌లు రెండేసి వికెట్లతో చెలరేగడంతో ఆసీస్‌ 152 పరుగులకే కుప్పకూలింది.

అంతకు ముందురోజు:

అంతకు ముందురోజు:

దక్షిణాఫ్రికా లెగ్‌స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌ నవ్వులపాలయ్యాడు. వికెట్‌ పడిందనుకున్న ఆనందంలో కొంచెం ఎక్కువ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ఆస్ట్రేలియా దేశవాళీ జట్టు ప్రైమ్‌ మినిస్టర్‌ X1తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో కగిసో రబడా వేసిన ఆరో ఓవర్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ జోష్‌ ఫిలిప్‌ భారీ షాట్‌ ఆడాడు. ఆ బంతిని డీప్‌ఫైన్‌ లెగ్‌ దిశగా బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న తాహీర్‌ అద్భుతంగా అందుకున్నాడు.

తాహీర్‌ ఆనందం కాస్త ఆవిరై

ఆ బంతి కాస్త నోబాల్‌ కావడంతో తాహీర్‌ ఆనందం కాస్త ఆవిరైంది. అంపైర్‌ వైపు ఏ మాత్రం చూడకుండా చేసిన హడావుడికి తన మొహం చిన్నబోయింది. ఇక ఇలా దొరికిన తాహిర్‌ను అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఓ ఆటాడుకుంటున్నారు. ‘ముందు అంపైర్‌ను చూడు.. ఆ తర్వాత సెలబ్రెషన్స్‌ చేసుకుందువు కానీ' అని కామెంట్‌ చేస్తున్నారు.

Story first published: Sunday, November 4, 2018, 15:40 [IST]
Other articles published on Nov 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+