Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండియాతో తలపడే వెస్టిండీస్ జట్టు ఇదే.. ! హెట్మయర్ ఎంట్రీ.. తొలి టీ20కి ప్లేయింగ్ 11 వీరే..!

Westindies Squad For T20 Serieses Against India and Newzealand Announced

క్రికెట్ వెస్టిండీస్ (CWI) ఇండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అలాగే న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 16మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్ 3-0తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇండియాతో టీ20 సిరీస్లో అమీతుమీ తేల్చుకోవడానికి విండీస్ సిద్ధమైంది. జూలై 29, ఆగస్టు 1, 2, 6, 7తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. నేడు ఈ సిరీస్ తొలి మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.

వారిద్దరు మళ్లీ మిస్

వారిద్దరు మళ్లీ మిస్

ఇండియాతో సిరీస్ తర్వాత వెస్టిండీస్ న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఇది ఆగస్టు 10, ఆగస్టు 12, ఆగస్టు 14తేదీల్లో జరుగుతుంది. అలాగే ప్రతి మ్యాచ్‌కు ముందు అధికారికంగా 13మంది సభ్యుల జట్టును నామినేట్ చేయనున్నారు. ఇకపోతే ఆ జట్టు స్టార్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మయర్ టీ20సిరీస్‌లకు అందుబాటులోకి రావడం గమనార్హం. ఐపీఎల్లో షిమ్రాన్ హెట్మయర్ ఏ రేంజులో ఆడతాడో తెలిసిందే. ఇకపోతే ఎప్పటిలాగే పేసర్ షెల్డన్ కాట్రెల్, ఆల్ రౌండర్ ఫాబియన్ అలెన్ జట్టుకు ఎంపిక కాలేదు. షెల్డన్ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటుండగా.. వ్యక్తిగత కారణాల వల్ల అలెన్ అందుబాటులో లేడు.

 మాకో ఫినిషర్ ఉన్నాడు

మాకో ఫినిషర్ ఉన్నాడు

వెస్టిండీస్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ జట్టు ఎంపిక గురించి మాట్లాడుతూ.. రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ‌కప్ - 2022ని దృష్టిలో ఉంచుకుని జట్టును నిర్మిస్తున్నట్లు చెప్పాడు. హెట్మెయర్‌ తిరిగి జట్టులోకి రావడం సంతోషంగా ఉంది. అతను బ్యాటింగ్ లైనప్‌ను పటిష్టం చేయగలడు. అతని అనుభవం జట్టుకు మేలు చేకూర్చుతుంది. అతని ఎంపిక వల్ల మ్యాచ్‌లను గెలవగల 'ఫినిషర్' మా జట్టు పక్క ఉన్నాడనే ధీమా వచ్చిందన్నాడు. ఇక ఈ రెండు సిరీస్ల ద్వారా అంతర్జాతీయ వేదికపై ఆటగాళ్లకు కొంత ఎక్స్‌పోజర్ ఇవ్వడంతో సరైన కాంబినేషన్‌ను కనుగొనగలిగే వీలుంటుందని చెప్పాడు.

భారత్, న్యూజిలాండ్ టీ20ల కోసం వెస్టిండీస్ జట్టు:

భారత్, న్యూజిలాండ్ టీ20ల కోసం వెస్టిండీస్ జట్టు:

నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, డొమినిక్ డ్రేక్స్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, ఒబెడ్ మెక్‌కాయ్, కీమో పాల్, రొమారియో షెపర్డ్, ఒడెవాన్ షెపర్డ్, థామస్, హేడెన్ వాల్ష్

ఇండియాతో నేటి తొలి వన్డేకు ప్లేయింగ్ 11 అంచనా

నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, డొమినిక్ డ్రేక్స్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్, కీమో పాల్, రొమారియో షెపర్డ్, హేడెన్ వాల్ష్

Story first published: Friday, July 29, 2022, 16:37 [IST]
Other articles published on Jul 29, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+