Nicholas Pooran : మా జట్టు ఆ అంటువ్యాధితో బాధపడుతుంది.. అయినా మే సవాల్‌కు సై

వెస్టిండీస్ తమ చివరి ఎనిమిది వన్డే మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది. ఇక ఇండియాతో నేడు జరగబోయే మూడో వన్డేకు ముందు కెప్టెన్ నికోలస్ పూరన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విండీస్ టీం.. తన బలాలను గుర్తించడానికి, విజయ మార్గంలోకి రావడానికి ఎంతో దూరంలో లేదన్నాడు. 'ఈ గేమ్ మాకు అనే విషయాలను బోధిస్తూనే ఉంది. ఓటములకు సంబంధించిన అనుభవాన్ని పొందుతున్నందుకు నేను సంతోషంగానే ఉన్నాను. అయితే ఓటములను ఎదుర్కోవడం కష్టం. నేను కాస్త నిరాశ చెందాను. కానీ ఇక్కడే మాకో అభ్యాసం జరుగుతుంది. మేం ఓ జట్టుగా కారణాలేంటో అర్థం చేసుకుంటున్నాం. నిజానికి మాకు ఈ టైంలో ఇలాంటి అనుభవం అవసరం అని తెలుసు.' పూరన్ పేర్కొన్నాడు.

మళ్లీ ఛాలెంజ్‌కు సిద్ధం
'నా ప్రకారం గెలుపు పరంపర అయినా ఓటముల పరంపర అయినా ఓ అంటువ్యాధి లాంటిది. అది నేను చెబుతూనే ఉన్నాను. వన్డే క్రికెట్‌లో ప్రస్తుతం మేం ఓటమి అనే అంటువ్యాధిని ఎదుర్కొంటున్నాము. దీని వల్ల మేం మ్యాచ్‌లు కోల్పోతున్నాం. కానీ మాకు మా మీద విశ్వాసం మాత్రం సడడలేదు. ఈ అంటువ్యాధిని తరిమికొట్టడానికి మా జట్టు సభ్యులందరు మళ్లీ ఛాలెంజ్‌కి సిద్ధమయ్యారు. మేము విజయ బాటలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా హృదయాలను, సౌల్‌లను ఆటపై ఉంచి ఒక జట్టుగా కలిసి ప్రదర్శన చేయడానికి సన్నద్ధమయ్యాము' అని పూరన్ తెలిపాడు.

వెస్టిండీస్‌కు సానుకూలాంశాలు
ఇకపోతే ఇండియాతో వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌కు కొన్ని సానుకూలాంశాలున్నాయి. వారు రెండుసార్లు 300కు మంచి పరుగులు చేయగలిగారు. ఒకసారి తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు.. రెండోసారి సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినప్పుడు ఆ జట్టు 300పైచిలుకు పరుగులు చేయగలిగింది. వారు తమ 50ఓవర్ల పూర్తి కోటాను రెండు సందర్భాలలో బ్యాటింగ్లో ఉపయోగించుకోగలిగారు. అది వారికి కాస్త ఊరటనిచ్చే విషయం కూడా. ఈ రెండు విషయాల ఆధారంగా.. వెస్టిండీస్ పూర్తి జట్టు ప్రదర్శన బయటికొచ్చేస్తుందని పూరన్ అభిప్రాయపడ్డాడు.

బ్యాటింగ్ బెటరా.. బౌలింగ్ బెటరా చెప్పలేను
'మేము జట్టుగా ధీటైన ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాం. నేను ఇప్పుడే ఓ అంచనా వేయలేను. మా బ్యాటింగే మా బలమని, లేదా మా బౌలింగే మా బలమని నేను చెప్పదలచుకోలేదు. జట్టుగా మేము ఇంకా ప్రతి విభాగాన్ని మేము గుర్తిస్తున్నాము. అయినా మా నుంచి ఇంకా కావాల్సినంత సమిష్టి కృషిని చేయలేకపోయాం, అందువల్ల ఫలితాలు మాకు అనుగుణంగా రావట్లేదు. కానీ మేం ఒక యూనిట్‌గా ఎక్కువ ఆటలు ఆడబోతున్నాం. మేము మా విజయ రహస్యాన్ని గుర్తించబోతున్నాం. మేము ఆ విజయ గీతను దాటడానికి చాలా దగ్గరగా ఉన్నాం' అని పూరన్ చెప్పాడు.

ఫిట్ నెస్ సాధించిన హెట్మయర్ రెడీ..?
ఇకపోతే ఆ జట్టు స్టార్ షిమ్రాన్ హెట్మెయర్ తన ఫిట్‌నెస్ పరీక్షలో ఇటీవలే ఉత్తీర్ణుడయ్యాడని, భవిష్యత్తులో వెస్టిండీస్ టీం ఎంపికకు అందుబాటులోకి వస్తాడని పూరన్ వెల్లడించాడు. గతంలో ఫిట్‌నెస్ సమస్యల కారణంగా గతేడాది UAEలో జరిగిన పురుషుల టీ20 ప్రపంచకప్ నుంచి హెట్మెయర్ వెస్టిండీస్ జట్టులో భాగం కాలేదు. అయితే ఐపీఎల్లో మాత్రం అతను ఫిట్ నెస్ బానే ఉంది. మళ్లీ ఫిట్ నెస్ కోల్పోయి ఇటీవలే తిరిగి సాధించాడు. ఇక అతను వీలయినంత త్వరగా తిరిగి జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నట్లు పూరన్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications