T20 World Cup 2022 : హిట్టర్స్ ప్యాక్డ్ టీం.. భీకర ప్లేయర్లతో బరిలోకి వెస్టిండీస్

రెండుసార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ ఈ ఫార్మాట్లో భీకరమైన జట్టనే సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. టీ20 ప్రపంచకప్‌ను రెండుసార్లు గెలిచిన ఏకైక జట్టు వెస్టిండీస్ మాత్రమే. ఈ సంవత్సరం కూడా మెగా ఈవెంట్‌లో తమను తాము నిరూపించుకోవడానికి ఆ జట్టు స్టార్ హిట్టర్లతో బరిలోకి దిగబోతుంది. ఇకపోతే నికోలస్ పూరన్ వెస్టిండీస్ జట్టుకు నాయకత్వం వహించనుండగా.. వైస్-కెప్టెన్సీ పాత్రను రోవ్‌మన్ పావెల్ నిర్వర్తించనున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో మంచి ప్రదర్శన చేస్తున్న సీనియర్ బ్యాటర్ జాన్సన్ చార్లెస్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు.
యువత, అనుభవ మేళవింపుగా జట్టు
వెస్టిండీస్ జట్టును మేం యువకులతో అలాగే అనుభవమున్న ప్లేయర్ల కలయికగా ఎంచుకున్నాం అని క్రికెట్ వెస్టిండీస్ లీడ్ సెలెక్టర్ డా.డెస్మండ్ హేన్స్ చెప్పారు. 'వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించడానికి మేము యువత, అనుభవం కలిగిన వాళ్లను ఎంచుకున్నాం. ఈ ఎంపిక ప్రక్రియలో మేము ప్రస్తుతం కొనసాగుతున్న సీపీఎల్లో రాణిస్తున్న ఆటగాళ్లను కూడా పరిగణనలోకి తీసుకున్నాము. బాగా రాణించడానికి స్కోప్ ఉన్న ఆటగాళ్లను కూడా జల్లెడ పడుతున్నాం. నా పదవీకాలం ప్రారంభం నుంచి నేను మంచి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి ఆసక్తితో ఉంటున్నాను.. నేను దాన్ని నా పదవీ ఆసాంతం చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది మేము ఎంచుకున్న చాలా మంచి జట్టు అని నేను నమ్ముతున్నాను. మేము క్వాలిఫయర్ రౌండ్ నుంచి సూపర్ 12లకు అర్హత సాధించవలసి ఉన్నందున తప్పకుండా ప్రతి అడ్డంకిని ఈ జట్టు ఎదుర్కొంటుందని ఆశిస్తున్నాను' అని హేన్స్ అన్నాడు.

వాళ్లకు కూడా అవకాశాలుంటాయి
'జట్టులో ఎంపిక చేయని కొందరు ఆటగాళ్ళు ఉన్నారు. వారు మరింత కష్టపడి ప్రదర్శన బాగా కొనసాగిస్తారని ఆశిస్తున్నా. ప్రస్తుతం జరుగుతున్న CPLలో అలాగే రాబోయే CG యునైటెడ్ సూపర్50 కప్‌లో వాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే గాయాలు లేదా ఏదైనా ఇతర ఊహించలేని పరిస్థితుల్లో ఎంపిక చేసిన జట్టులోని ఆటగాళ్లు దూరమైతే తప్పకుండా వాళ్లకు అవకాశాలుంటాయి. అందువల్ల రానున్న టోర్నీల్లో జట్టుకు ఎంపిక కాని సమర్థులైన ఆటగాళ్లు తమ ప్రదర్శన మీద మరింత ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నాను' అని హేన్స్ అన్నారు.

రాబోయే టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్ జట్టు
నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), యానిక్ కారియా, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, షిమ్రాన్ హేట్మయర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కైల్ మేయర్స్, ఒబెడ్ మెక్‌కాయ్, రేమాన్ రీఫర్, ఓడియన్ రీఫర్,
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications