T20 World Cup 2022: కీలక మ్యాచ్‍లో వెస్టిండీస్ విజయం.. సూపర్-12 ఆశలు సజీవం..

కీలక మ్యాచ్ లో వెస్టిండీస్ విజయం సాధించింది. జింబాబ్వేపై 31 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సూపర్ 12 ఛాన్స్ ఉండడంతో వెస్టిండీస్ చాలా అద్భుతంగా రాణించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసి వెస్టిండీస్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఆటగాళ్లలో చార్లెస్ 36 బంతుల్లో 2 సిక్స్ లు, 3 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. పావెల్ రెండు భారీ సిక్స్ లతో 28 పరుగులు చేయగా.. హుస్సేన్ 23 పరుగులు చేశాడు.
జోసఫ్
జింబాబ్వే బౌలర్లలో రజా మూడు వికెట్లు పడగొట్టగా.. ముజరబాని 2 వికెట్లు తీశాడు. విలియమ్స్ ఒక వికెట్ పడగొట్టాడు. 154 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 18.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌట్ అయింది. జింబాబ్వే ఆటగాళ్లలో ల్యూక్ జోంగ్వే 29 పరుగులు చేయగా.. వెస్లీ మాధేవేరే 27 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో అజారి జోసఫ్ 4 వికెట్లు పడగొట్టగా.. హోల్డర్ 3 వికెట్లు తీశాడు. హుస్సేన్, ఒడియన్ ఒక్కో వికెట్ పడగొట్టాడు.

సూపర్ 12
జింబాబ్వేపై గెలుపుతో వెస్టిండీస్ సూపర్-12 ఆశలు సజీవంగా ఉన్నాయి. మరో మ్యాచ్ వెస్టిండీస్ మెరుగైన రన్ రేటు తో గెలిస్తే సూపర్ 12 ఛాన్స్ ఉంటుంది. సూపర్ 12 మ్యాచ్ లు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. సూపర్ 12 ప్రారంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications