For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ ఓటమి: టీ20 సిరిస్ వెస్టిండిస్‌దే

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా వెస్టిండిస్ మహిళలతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. దీంతో సిరిస్‌లో ఇంకో మ్యాచ్ మిగిలుండగానే భారత మహిళల జట్టు సిరిస్‌ను కోల్పోయింది.

By Nageshwara Rao

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా వెస్టిండిస్ మహిళలతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. దీంతో సిరిస్‌లో ఇంకో మ్యాచ్ మిగిలుండగానే భారత మహిళల జట్టు సిరిస్‌ను కోల్పోయింది. 138 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు లక్ష్యాన్ని చేధించే క్రమంలో 18.1 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది.

దీంతో ఆతిథ్య జట్టు భారత మహిళల జట్టుపై 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత జట్టులో హర్మన్ ప్రీత్ కౌర్(43), దీప్తి శర్మ(24) మినహా ఎవరూ రాణించలేదు. 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత జట్టుని హర్మన్ ప్రీత్ ఆదుకునే ప్రయత్నం చేశారు.

west indies women beats indian women in second twenty

అయితే మిగతా క్రీడాకారిణులు ఆమెకు సహకరించకపోవడంతో భారత జట్టు ఓటమి పాలైంది. భారత జట్టులో ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం విశేషం. వెస్టిండిస్ బౌలర్లలో డాటిన్, అనీసాలు తలో మూడు వికెట్లు తీసుకోగా, మాథ్యూస్‌కు రెండు వికెట్లు లభించాయి.

ఇక అంగ్విల్లెరియా, క్వింటైన్ లకు చెరో వికెట్ దక్కింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. వెస్టిండిస్ జట్టులో స్టెఫానీ టేలర్(47), డాటిన్(35), అంగ్వెల్లిరియా(21), మాథ్యూస్(27)లు రాణించారు. కాగా తొలి టీ20 ఆరు వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+