T20 World Cup 2022: వెస్టిండీస్ భవితవ్యం తేలేది నేడే.. గెలిస్తే సూపర్-12కు లేకుంటే ఇంటికే..

రెండు సార్లు టీ20 ప్రపంచ కప్ విజేత వెస్టిండీస్ ఇప్పడు క్వాలిఫయర్ మ్యాచ్ లు ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. మేటి హిట్టర్లున్న జట్టు ఇప్పుడు సూపర్-12కు వెళ్తుందా లేదా అని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గ్రూప్ మ్యాచ్ ల్లో స్కాట్లాండ్ చేతిలో ఓడిపోయిన కరేబియన్ జట్టు.. ఆ తర్వాత జింబాంబ్వేపై గెలిచి సూపర్-12 ఆశలు సజీవంగా ఉంచుకుంది. అయితే శుక్రవారం ఐర్లాండ్ తో జరిగే మ్యాచ్ లో వెస్డిండీస్ గెలిస్తేనే సూపర్-12కు వెళ్తుంది. లేకుంటే వరల్డ్ కప్ నుంచి ఔటవుతుంది.

స్కాట్లాండ్ చేతిలో
గ్రూప్ బి మొదటి మ్యాచ్ లో వెస్టిండీస్ స్కాట్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. జార్జ్ మున్సే 66 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 161 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ అనూహ్య రీతిలో 118 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో పసికూన స్కాట్లాండ్ చేతిలో 42 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఈ ఓటమితో విస్టిండీస్ పని అయిపోయిందనుకున్నారు.

జింబాంబ్వేపై
కానీ రెండు మ్యాచ్ బౌన్స్ బ్యాక్ అయిన వెస్టిండీస్ జింబాంబ్వేను మట్టి కరిపించింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. జాన్సన్ చార్లెస్ 45 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 154 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాంబ్వే 122 పరుగులకే కుప్పకూలిపోయింది. 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. వెస్టిండీస్ బౌలర్ జోసేఫ్ నాలుగు ఓవర్లకు 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.

ఎవరు గెలచినా
ఇక గ్రూప్ విషయానికొస్తే ఇందులో వెస్టిండీస్, జింబాంబ్వే, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఉన్నాయి. ఈ నాలుగు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి రెండేసి పాయింట్లతో ఉన్నాయి. ఇవాళ జరగబోయే మ్యాచ్ ల్లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సూపర్-12కు వెళ్తుంది. ఉదయం 9:30లకు హంబర్ట్ లో వెస్టిండీస్ తో ఐర్లాండ్ తలపడనుండగా.. ఇదే స్టేడియంలో మధ్యాహ్నం 1: 30 గంటలకు జింబాంబ్వేతో స్కాట్లాండ్ పోటీ పడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications