Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌కూ లేని అరుదైన ఘనత వెస్టిండీస్ సొంతం- తొలి మ్యాచ్‌లో..!!

West Indies will be squaring off against Scotland in their opening game of the T20 World Cup

బ్రిస్బేన్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌ రసవత్తరంగా ఆరంభమైంది. తొలిరోజే సంచలనాలు నమోదయ్యాయి. నమీబియా చేతిలో శ్రీలంక మట్టి దారుణ పరాజయాన్ని చవి చూసింది. రెండో మ్యాచ్‌లోనూ అవే తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. అనుభవం ఉన్న నెదర్లాండ్స్‌ను దాదాపుగా ఓడించినంత పని చేసింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి నెదర్లాండ్స్ చివరి బంతి వరకూ ఆడాల్సొచ్చింది.

ఇవ్వాళ మరో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. వెస్టిండీస్ జట్టు స్కాట్లాండ్‌తో తలపడబోతోంది. ఈ మ్యాచ్ ఈ ఉదయం 9:30 గంటలకు మొదలవుతుంది. హోబర్ట్‌లోని ఓవల్ స్టేడియ దీనికి వేదిక. రెండో మ్యాచ్ ఐర్లాండ్-జింబాబ్వేల మధ్య ఉంటుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు ఇది షెడ్యూల్ అయింది. ఇవ్వాళ జరిగే ఈ రెండు మ్యాచ్‌లు కూడా అభిమానులను కట్టి పడేసేవే. రెండు మ్యాచ్‌లల్లోనూ భారీ స్కోర్లు నమోదు కావడానికి అవకాశాలు ఉన్నాయి.

ఇదివరకు రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ను లిఫ్ట్ చేసిన ఘనత ఉన్న జట్టు విండీస్. ఈ అవకాశం భారత్‌కు కూడా దక్కలేదు. 2012, 2016 టోర్నమెంట్లల్లో ఛాంపియన్‌గా నిలిచారు కరేబియన్ వీరులు. ఆ తరువాత మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం గ్రూప్ దశ మ్యాచ్‌లను ఆడాల్సి వస్తోందా జట్టుకు. పెద్దగా అంచనాలేవీ ఉండట్లేదు. టీ20 ఫార్మట్‌లో అంచనాలకు దూరంగా ఉంటోందా జట్టు పెర్ఫార్మెన్స్.

గ్రూప్ దశను దాటుకుంటేనే సూపర్ 12లోకి అడుగు పెట్టగలుగుతుంది. పెద్దగా అంచనాలేవీ వెస్టిండీస్ జట్టుపై లేనప్పటికీ.. అద్భుతాలు జరగబోవనే గ్యారంటీ ఉండట్లేదు. వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ ఒక్కసారి గాడిన పడితే- ప్రత్యర్థికి చుక్కలే చూపిస్తారు. 2016 వెస్టిండీస్ ఏ రేంజ్‌లో కప్‌ను అందుకుందో ఎప్పటికీ మరిచిపోలేరు అభిమానులు. చివరి ఓవర్‌లో వరుసగా సిక్సర్లు బాది మరీ ఇంగ్లాండ్‌ను ఓడించిందా జట్టు. ఇప్పుడూ అలాంటి ఘటనలు రిపీట్ కావొచ్చు.

నికోలస్ పూరన్ సారథ్యాన్ని వహిస్తోన్న ఈ జట్టులో జాన్సన్ ఛార్లెస్, ఎవిన్ లూయిస్, షమర్ బ్రూక్స్, బ్రెండన్ కింగ్, రౌమన్ పావెల్, కైలే మేయర్స్, జేసన్ హోల్డర్, రేమాన్ రీఫర్, ఓడియన్ స్మిత్, యానిక్ కారియా, షెల్డన్ కాట్రెల్, అల్జారీ జోసెఫ్, అకీల్ ఎం హోసైన్ ఉన్నారు. వీరిలో చాలామందికి ఐపీఎల్ టోర్నమెంట్ ఆడిన అనుభవం ఉంది.

Story first published: Monday, October 17, 2022, 8:10 [IST]
Other articles published on Oct 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+