Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుమ్రా vs కోహ్లీ: హ్యాట్రిక్ ఘనత నీదే.. కాదు అది ఎప్పటికీ నీదే!!

West Indies vs India: Virat kohli response about Jasprit Bumrah Hat-Trick words

కింగ్‌స్టన్: విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా హ్యాట్రిక్ పడగొట్టిన విషయం తెలిసిందే. రెండో రోజు మ్యాచ్ అనంతరం బుమ్రాను కెప్టెన్ విరాట్ కొహ్లీ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా హ్యాట్రిక్ తీసినందుకు కోహ్లీ కంగ్రాట్స్ తెలిపాడు. హ్యాట్రిక్ తీయడం ఎలా ఉందని బుమ్రాను కోహ్లీ అడగ్గా.. 'చాలా సంతోషంగా ఉంది. ఈ ఘనత మీకే చెందుతుంది' అని బదులిచ్చాడు.

దీంతో కోహ్లీ ఒక్కసారిగా పగలబడి నవ్వాడు. అనంతరం 'కాదు.. ఆ ఘనత ఎప్పటికీ నీదే. నీవు అద్భుతంగా బౌలింగ్ చేసావ్. అందుకే ఈ అరుదైన ఘనత నీకు దక్కింది' అని కోహ్లీ అన్నాడు. దీంతో ఇద్దరు కలిసి సరదాగా నవ్వుకున్నారు. అనంతరం కోహ్లీ తన ఇంటర్వ్యూ కొనసాగించాడు. కోహ్లీ అడిగిన పలు ప్రశ్నలకు బుమ్రా సమాధానాలు ఇచ్చాడు. దీనికి సంబందించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్‌ను బుమ్రా బెంబేలెత్తించాడు. తొమ్మిదో ఓవర్లో హ్యాట్రిక్ న‌మోదు చేసాడు. తొమ్మిదో ఓవర్‌ రెండో బంతికి డారెన్‌ బ్రావో (4)ను ఔట్ చేశాడు. బుమ్రా వేసిన బంతి బ్రావో బ్యాట్‌ను టచ్ చేస్తూ.. స్లిప్‌లో ఉన్న రాహుల్‌ చేతిలో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బ్రూక్స్ (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం చేజ్‌ (0) కూడా పరుగులేమీ చేయకుండా ఎల్బీ ఔట్‌ అయ్యాడు.

అయితే రోస్టన్ చేజ్‌కు వేసిన బంతి అతని ప్యాడ్‌లను తాకింది. బుమ్రా ఎల్బీ కోసం అప్పీల్ చేయకున్నా, కోహ్లీ ఎంపైర్‌కు అప్పీల్ చేయగా.. ఆయన తిరస్కరించాడు. దీంతో రహనే, బుమ్రాతో చర్చించి కోహ్లీ రివ్యూకు వెళ్లగా.. చేజ్ ఔటయినట్లు తేలింది. దీంతో బుమ్రాకు హ్యాట్రిక్ దక్కడంతో జట్టు సభ్యులంతా సంబరాలు చేసుకున్నారు.

Story first published: Monday, September 2, 2019, 19:07 [IST]
Other articles published on Sep 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+