Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. భారత్ తుది జట్టు కూర్పుపై మాజీ కెప్టెన్‌ ఆశ్చర్యం!!

West Indies vs India: Sourav Ganguly Surprised With Rohit Sharma, Ravichandran Ashwins Exclusion From First Test

కోల్‌కతా: వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌ టీమిండియా తుది జట్టు కూర్పుపై మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తొలి టెస్టుకు ఓపెనర్ రోహిత్ శర్మ, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేకపోవడం చాలా ప్రశ్నలను లేవనెత్తింది. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తొలి టెస్టు భారత జట్టు ఎంపికపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్‌ గావస్కర్‌ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

తాజాగా గుంగూలీ మాట్లాడుతూ... 'రోహిత్‌, అశ్విన్‌లు తుది జట్టులో ఉంటారనే అనుకున్నా. కానీ.. నా అంచనా తప్పయింది. వారు జట్టులో లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. పేస్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ముగ్గురు పేస్ బౌలర్లతో సిద్ధం కావడం సరైన నిర్ణయమే. కానీ..స్పెషలిస్టు స్పిన్నర్‌గా అశ్విన్‌కు చోటు కల్పించకపోవడం సరైనది కాదు. విండీస్‌పై అశ్విన్‌కు మంచి రికార్డు ఉంది' అని గుర్తు చేసాడు.

'రోహిత్‌ శర్మను పక్కకు పెట్టి మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేయడం అనాలోచిత నిర్ణయం. యువ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను సైతం ఎంపిక చేయకపోవడం కూడా పెద్ద తప్పిదం. కుల్దీప్‌ ఈ మధ్య బాగా రాణిస్తున్నాడు. చివరగా ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కుల్దీప్‌ ఐదు వికెట్లతో రాణించాడు' అని పేర్కొన్నాడు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు రోహిత్‌ శర్మను ఓపెనర్‌గా పంపాలని గంగూలీ సూచించాడు. రోహిత్‌ను టెస్టుల్లో ఓపెనర్‌గా పంపి ప్రయోగం చేయాలన్నాడు.

'టెస్టుల్లో అశ్విన్‌కు మంచి రికార్డు ఉంది. అందులోనూ వెస్టిండీస్‌పై అత్యద్భుతమై రికార్డు కలిగి ఉన్నాడు. అలాంటి ఆటగాడికి 11 మంది సభ్యులతో కూడిన జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది' అంటూ మాజీ కెప్టెన్ సునీల్‌ గావస్కర్‌ పేర్కొన్నాడు. గావస్కర్‌తో పాటు పలువురు మాజీలు కూడా తీవ్రంగా విమర్శించారు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీపై ట్విట్టర్‌లో విమర్శల వర్షం కురుస్తోంది.

Story first published: Sunday, August 25, 2019, 17:55 [IST]
Other articles published on Aug 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+