న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆల్‌రౌండర్‌కు ఫిట్‌నెస్ చాలా ముఖ్యం.. నా స్కిల్స్‌ను పెంచుకోవడానికి నిత్యం శ్రమిస్తా'

West Indies vs India: Shivam Dube said I try to enhance my skills as an all-rounder

ముంబై: టీమిండియా యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఫిట్‌నెస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఉండాలంటే ఫిట్‌నెస్ తప్పనిసరిగా కలిగి ఉండాలని చెప్పాడు. ఎల్లప్పుడూ ఫిట్‌నెస్‌కే పెద్దపీట వేస్తానని దూబే పేర్కొన్నాడు. గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటుతున్న దూబే.. ఇటీవల భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో సత్తా చాటాడు.

మరో రెండేళ్ల పాటు ధోనీ క్రికెట్ ఆడుతాడు.. 2021 ఐపీఎల్‌ తర్వాతే వీడ్కోలు!!మరో రెండేళ్ల పాటు ధోనీ క్రికెట్ ఆడుతాడు.. 2021 ఐపీఎల్‌ తర్వాతే వీడ్కోలు!!

వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో కూడా మంచి ప్రదర్శన చేసి జాతీయ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని దూబే భావిస్తున్నాడు. ఈ క్రమంలో ఫిట్‌నెస్‌ను పెంపొందించుకోవడంతో పాటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో స్కిల్స్ పెంచుకుంటున్నట్లు దూబే తెలిపాడు. తాజాగా దూబే మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నాడు.

'ఫిట్‌నెస్ కోసం గంటలకొద్ది శ్రమిస్తా. ఆల్‌రౌండర్‌గా నా స్కిల్స్‌ పెంచుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తా. టోర్నమెంట్‌లు, మ్యాచ్‌లు లేని సమయాల్లో నా బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెడతా. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు నేను నేర్చుకున్న స్కిల్స్ అమలు చేస్తా. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో దృష్టి సారించడంతో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఆల్‌రౌండర్‌గా ఉన్నపుడు ఇలాంటివి ఎదుర్కోక తప్పదు' అని దూబే తెలిపాడు.

వచ్చే నెలలో జరిగే భారత పర్యటనకు వెస్టిండీస్‌ రానుంది. భారత పర్యటనలో వెస్టిండీస్‌ 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ దూబేకు చాలా ముఖ్యం. ఈ సిరీస్‌లో సత్తాచాటి భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం దూబే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై తరపున ఆడుతున్నాడు.

Story first published: Wednesday, November 27, 2019, 16:05 [IST]
Other articles published on Nov 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X