న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్‌ టూర్.. రోహిత్‌ శర్మకి విశ్రాంతి?

India vs West Indies 2019 : Rohit Sharma Likely To Be Rested For The ODI Series || Oneindia Telugu
West Indies vs India: Rohit Sharma To Be Rested For West Indies ODIs

ఢిల్లీ: గత రెండు సంవత్సరాలుగా టీమిండియా విదేశీ, స్వదేశీ పర్యటనలతో బిజీగా గడుపుతోంది. ఈ వేసవిలో ఆటగాళ్లు అందరూ ఐపీఎల్, ప్రపంచకప్ లాంటి సుదీర్ఘ టోర్నీలలో ఆడారు. ఆ తర్వాత వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా పర్యటనలు టీంఇండియా పూర్తి చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇక వెస్టిండీస్‌తో డిసెంబర్‌లో టీంఇండియా మరో సిరీస్ ఆడనుంది.

విండీస్ ఆటగాడికి యువీ పంజాబీ పాఠాలు.. నవ్వుకుంటున్న నెటిజన్లు (వీడియో)విండీస్ ఆటగాడికి యువీ పంజాబీ పాఠాలు.. నవ్వుకుంటున్న నెటిజన్లు (వీడియో)

రోహిత్‌ శర్మకి విశ్రాంతి?:

రోహిత్‌ శర్మకి విశ్రాంతి?:

అయితే వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కి ఓపెనర్‌ రోహిత్‌ శర్మ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఓ స్పోర్ట్స్ సంస్థ కథనం రాసింది. భారత్‌ గడ్డపై డిసెంబర్‌ 6 నుంచి టీమిండియాతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ని వెస్టిండీస్‌ ఆడేలా ఇప్పటికే బీసీసీఐ షెడ్యూల్‌ రూపొందించింది. అయితే వన్డే సిరీస్‌ నుంచి రోహిత్‌ శర్మకి విశ్రాంతినివ్వాలని భారత సెలక్టర్లు ఆలోచిస్తున్నారట.

21న తుది నిర్ణయం:

21న తుది నిర్ణయం:

రోటేషన్‌ పద్దతిలో ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన టీ20ల సిరీస్‌ నుంచి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతిని ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రోహిత్ వంతు వచ్చింది. వెస్టిండీస్‌తో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌ల కోసం ఒకేసారి జట్లని ప్రకటించాలని భారత సెలక్టర్లు ప్రణాళికలు చేస్తున్నారట. ఈ నెల 21న గురువారం ముంబైలో సెలక్టర్లు సమావేశం కానున్నారట. ఈ సమావేశంలో రోహిత్‌ శర్మకి విశ్రాంతి ఇచ్చే విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం తెలుస్తోంది.

60 మ్యాచ్‌లు ఆడాడు:

60 మ్యాచ్‌లు ఆడాడు:

రోహిత్‌ శర్మ ఈ ఏడాది ఆరంభం నుంచి దాదాపు 60 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 16 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఉండగా.. మిగిలిన వాటిలో టీ20లు, వన్డేలు, టెస్టులు ఉన్నాయి. ప్రపంచకప్‌లో రోహిత్ సెంచరీలతో పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. ఇక దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో కూడా చెలరేగాడు. ఒకవేళ రోహిత్ వన్డే సిరీస్‌లో లేకపోతే.. రాహుల్ ఆ స్థానంను ఆక్రమించే అవకాశం ఉంది.

తొలి డే/నైట్‌ టెస్ట్‌:

తొలి డే/నైట్‌ టెస్ట్‌:

ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత్‌ ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఈనెల 22న చారిత్రక డే/నైట్‌ టెస్టు ప్రారంభం కానుంది. ఇరు జట్లు ఆడబోతున్న తొలి డే/నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈడెన్‌పైనే ఉంది.

Story first published: Tuesday, November 19, 2019, 20:26 [IST]
Other articles published on Nov 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X