వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌.. ధోనీ రికార్డును బద్దలు కొట్టిన పంత్‌!!

India vs West Indies 2nd Test : Rishabh Pant Breaks MS Dhoni's Wicketkeeping Record For India

కింగ్‌స్టన్‌: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ వెస్టిండీస్‌ పర్యటనలో బ్యాట్‌తో అంతగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా వెస్టిండీస్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లోని మూడు ఇన్నింగ్స్‌లలో 19.33 సగటుతో కేవలం 58 పరుగులు సాధించాడు. అయితే స్టంప్స్ వెనుక చురుగ్గా కదులుతూ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు మొత్తం ఎనిమిది క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు.

వెస్టిండీస్‌తో రెండో టెస్టు: కోహ్లీ 'గోల్డెన్‌ డక్‌'.. ఇది ఎన్నోసారంటే?

11 మ్యాచ్‌ల్లోనే 50 ఔట్‌లు:

11 మ్యాచ్‌ల్లోనే 50 ఔట్‌లు:

11వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న పంత్ తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో వేగంగా 50 ఔట్‌లు చేసిన భారత వికెట్‌ కీపర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. ధోనీ 15 టెస్టుల్లో ఈ మైలురాయి సాధించగా.. పంత్‌ 11 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో పేసర్ ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో విండీస్ ఓపెనర్ బ్రాత్‌వైట్‌ను ఔట్‌ చేయడం ద్వారా పంత్ ఈ ఘనత సాధించాడు.

గిల్‌క్రిస్ట్ కూడా:

గిల్‌క్రిస్ట్ కూడా:

ఆసీస్ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా 11 మ్యాచ్‌ల్లోనే 50 ఔట్‌లలో పాలుపంచుకున్నాడు. పంత్ 11 మ్యాచ్‌ల్లోనే 50 ఔట్‌లు చేసి ధోనీ రికార్డుని బద్దలు కొట్టాడు. ఈ ఫీట్ సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా కూడా నిలిచాడు. ఈ జాబితాలో మార్క్ బౌచర్, జానీ బెయిర్‌స్టో, టిమ్ పైన్‌లు ముందు వరుసలో ఉన్నారు. వీరందరూ 10 మ్యాచ్‌ల్లోనే 50 ఔట్‌లలో పాలుపంచుకున్నారు. పంత్ ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో మొత్తం 48 క్యాచ్‌లు అందుకోగా.. కేవలం రెండు స్టంపింగ్‌లు మాత్రమే చేసాడు.

తొలి శతకం నాన్నకు అంకితం.. ఎక్కడున్నా ఆయన గర్వించే ఉంటారు: విహారి

భవిష్యత్తులో మరిన్ని రికార్డులు:

భవిష్యత్తులో మరిన్ని రికార్డులు:

అంతర్జాతీయ టి20ల్లో చాలా కాలంగా ఎంఎస్‌ ధోని పేరిట ఉన్న రికార్డును పంత్‌ ఇదివరకే బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా వికెట్‌ కీపర్‌గా పంత్ తన పేరును లిఖించుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌తో పాటు టెస్టుల్లోనూ రాణించగలనని పంత్‌ నిరూపించుకుంటున్నాడు. ఇదే ఫామ్‌ కొనసాగిస్తే భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తాడు. ఇక ధోనీ వారసుడుగా సెలక్టర్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. అయితే బ్యాట్‌తో ఇంకా రాణించాల్సిన వసరం ఉంది.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, September 2, 2019, 15:34 [IST]
Other articles published on Sep 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X