For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండిస్‌తో మ్యాచ్: విరాట్ కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన అంఫైర్

ICC Cricket World Cup 2019:Virat Kohli Got Warning From Empire During India V West Indies
West Indies vs India Live Score, World Cup 2019: Virat Kohli got warning from empire

హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఫీల్డ్ అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. వెస్టిండిస్ స్పిన్నర్ ఫబియిన్ అల్లెన్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో రెండు పరుగులు తీసే క్రమంలో విరాట్ కోహ్లీ పిచ్‌పై పరిగెత్తాడు. దీంతో ఫీల్డ్ అంఫైర్ విరాట్ కోహ్లీకి వార్నింగ్ ఇచ్చాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మ్యాచ్ జరుగుతున్న సమయంలో పిచ్‌పై పరిగెత్తడం నిషేధం. ఒకవేళ అలా పరిగెత్తితే అంఫైర్ తొలుత వార్నింగ్‌ ఇస్తాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం 16 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(31), విరాట్ కోహ్లీ(21) పరుగులతో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా జట్టు స్కోరు 29 పరుగుల వద్ద టీమిండియా రోహిత్ శర్మ(18) రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. కీమర్ రోచ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్ ఆఖరి బంతికి రోహిత్ శర్మ వికెట్ కీపర్ షాయ్ హోప్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

1
43677

అయితే, తొలుత రోహిత్ శర్మను ఫీల్డ్ అంఫైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో విండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌కు రివ్యూకు వెళ్లాడు. రివ్యూలో కీమర్ రోచ్ వేసిన బంతి రోహిత్ శర్మ బ్యాట్ ఎడ్జిని తీసుకున్నట్లు స్పష్టంగా తేలడంతో థర్డ్ అంఫైర్ ఔట్‌గా ప్రకటించాడు.

Story first published: Thursday, June 27, 2019, 16:23 [IST]
Other articles published on Jun 27, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+