Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ, ధోని హాఫ్ సెంచరీలు: విండిస్ విజయ లక్ష్యం 269

ICC Cricket World Cup 2019 : Team India First Innings Summary | India vs West Indies
West Indies vs India Live Score, World Cup 2019: MS Dhonis fifty guides india to 268/7

హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 82 బంతుల్లో 72(8ఫోర్లు), ధోని 61 బంతుల్లో 56(3 పోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీలతో చెలరేగగా... చివర్లో హార్ధిక్ పాండ్యా 38 బంతుల్లో 46(5 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. దీంతో వెస్టిండిస్‌కు 269 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. వెస్టిండిస్ బౌలర్లలో కీమర్ రోచ్ మూడు వికెట్లు... షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. దాంతో భారత్‌ ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ-కేఎల్ రాహుల్‌ ఆరంభించారు. అయితే, జట్టు స్కోరు 29 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ(18) వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా కీమర్ రోచ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్ ఆఖరి బంతికి రోహిత్ శర్మ బ్యాట్‌కు, ప్యాడ్‌కు మధ్యలోంచి కీపర్‌ షాయ్‌ హోప్‌ చేతుల్లోకి వెళ్లింది.

వివాదాస్పందగా రోహిత్ శర్మ ఔట్

దీనిపై విండీస్‌ ఆటగాళ్లు అప్పీల్‌కు వెళ్లగా ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. అయితే దీనిపై విండీస్‌ రివ్యూ కోరగా అందులో భారత్‌కు వ్యతిరేకంగా ఫలితం వచ్చింది. అయితే, రోహిత్ శర్మది ఔటా.. నాటౌటా అనే దానిపై పూర్తిగా స్పష్టత లేని క్రమంలో థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ, రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

రెండో వికెట్‌గా కేఎల్ రాహుల్ ఔట్

రోహిత్‌ ఔటైన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ నడిపించే బాధ్యతను తీసుకున్న రాహుల్‌ హోల్డర్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. విండీస్‌ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ వేసిన 21 ఓవర్‌ నాలుగో బంతికి రాహుల్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 64 బంతుల్లో 6 ఫోర్లతో 48 పరుగులు చేసిన రాహుల్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

నిరాశ పరిచిన విజయ్ శంకర్

దీంతో 98 పరుగుల వద్ద భారత్‌ రెండో వికెట్‌ను నష్టపోయింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నాలుగో స్థానంలో క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్(14) నిరాశపరిచాడు. కీమర్ రోచ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ షాయ్ హోప్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు.

వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ

ఈ ప్రపంచకప్‌లో కోహ్లీకి ఇది వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషం. కోహ్లీ హాఫ్ సెంచరీ అనంతరం టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 140 పరుగుల వద్ద కేదార్ జాదవ్ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ 29వ ఓవర్ ఐదో బంతికి కేదార్ జాదవ్(7) పరుగుల వద్ద కీమర్ రోచ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ షాయ్ హోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

పాండ్యా మెరుపులు

కేదార్ జాదవ్ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో కలిసి ధోని ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపించారు. పాండ్యా క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. అయితే, జట్టు స్కోరు 250 పరుగుల వద్ద షెల్డన్ కాట్రెల్ బౌలింగ్‌‌లో అలెన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో స్కోరు బోర్డులో వేగం నెమ్మదించింది.

ఆఖరి ఓవర్లో 16 పరుగులు

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షమీ రెండు పరుగుల వ్యవధిలోనే ఔటయ్యాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న ధోని 61 బంతుల్లో 56(3 పోర్లు, 2 సిక్సులు) కుల్దీప్ యాదవ్‌తో కలిసి చివర్లో పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లో ధోని రెండు సిక్సులు, ఒక ఫోర్‌తో 16 పరుగులు రాబట్టడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది.

1
43677

{headtohead_cricket_3_8}

Story first published: Thursday, June 27, 2019, 19:29 [IST]
Other articles published on Jun 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+