For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రివ్యూలో ఔట్‌గా రోహిత్ శర్మ: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

West Indies vs India Live Score, World Cup 2019: Early Setback For India As Rohit Sharma Falls To Kemar Roach

హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. మొదటి ఐదు ఓవర్లు ఓపెనర్లు నిలకడగా ఆడారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అయితే, జట్టు స్కోరు 29 పరుగుల వద్ద టీమిండియా రోహిత్ శర్మ(18) రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. కీమర్ రోచ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్ ఆఖరి బంతికి రోహిత్ శర్మ వికెట్ కీపర్ షాయ్ హోప్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అయితే, తొలుత రోహిత్ శర్మను ఫీల్డ్ అంఫైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.

దీంతో విండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌కు రివ్యూకు వెళ్లాడు. రివ్యూలో కీమర్ రోచ్ వేసిన బంతి రోహిత్ శర్మ బ్యాట్ ఎడ్జిని తీసుకున్నట్లు స్పష్టంగా తేలడంతో థర్డ్ అంఫైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో రోహిత్ శర్మ నిరాశగా పెవిలియన్‌కు చేరగా... విండిస్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.

ప్రస్తుతం 9 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. క్రీజులో విరాట్ కోహ్లీ(4), కేఎల్ రాహుల్(20) పరుగులతో ఉన్నారు.

Story first published: Thursday, June 27, 2019, 15:53 [IST]
Other articles published on Jun 27, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+