Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'హ్యాట్రిక్ క్లబ్‌లోకి స్వాగతం సోదరా.. ఈ ప్రదర్శన అలాగే కొనసాగించు'

WI VS IND: 'Keep It Going Brother': Harbhajan,Irfan Pathan Welcome Bumrah Into Elite Hat-Trick Club
West Indies vs India: Harbhajan Singh, Irfan Pathan Welcome Jasprit Bumrah Into Elite Hat-Trick Club

కింగ్‌స్టన్: తొలి టెస్టులో విండీస్‌కు తన పేస్‌ రుచి చూపించిన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. రెండో టెస్టులోనూ ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో టాప్‌-5 బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. అంతేకాదు హ్యాట్రిక్‌ ఉండటం విశేషం. హ్యాట్రిక్‌ వికెట్లు తీయడంతో టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన మూడవ భారత బౌలర్‌గా బుమ్రా రికార్డుల్లోకెక్కాడు.

హ్యాట్రిక్ సాధించిన బుమ్రాకు భారత మాజీ బౌలర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాట్రిక్ క్లబ్‌లోకి స్వాగతం బుమ్రా' అంటూ పఠాన్ ట్వీట్ చేశారు. 'సంచలనాత్మక స్పెల్. వెల్‌డన్ సోదరా. నీ ప్రదర్శన చాలా సంతృప్తిగా ఉంది. నీ పట్ల గర్వంగా ఉంది. ఈ ప్రదర్శన అలాగే కొనసాగించు' అని హర్భజన్ ట్వీట్ చేసాడు.

తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్‌ను బుమ్రా బెంబేలెత్తించాడు. ఏడో ఓవర్లోనే ఓపెనర్ క్యాంప్‌బెల్‌ (2)ను పెవిలియన్ చేర్చాడు. ఇక తొమ్మిదో ఓవర్లో హ్యాట్రిక్ న‌మోదు చేసాడు. తొమ్మిదో ఓవర్‌ రెండో బంతికి డారెన్‌ బ్రావో (4)ను ఔట్ చేశాడు. బుమ్రా వేసిన బంతి బ్రావో బ్యాట్‌ను టచ్ చేస్తూ.. స్లిప్‌లో ఉన్న రాహుల్‌ చేతిలో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బ్రూక్స్ (0) వికెట్ల ముందు దొరికి పోయాడు. అనంతరం చేజ్‌ (0) కూడా పరుగులేమీ చేయకుండా ఎల్బీ ఔట్‌ అయ్యాడు.

టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున బుమ్రా సాధించిన ఈ హ్యాట్రిక్ మూడోది. అంతకుముందు 2001లో స్టార్ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్‌ నమోదు చేయగా.. 2006లో ఇర్ఫాన్‌ పఠాన్‌ పాక్‌పై హ్యాట్రిక్‌ రికార్డు సాధించాడు. మళ్లీ 13 ఏళ్ల తర్వాత తాజాగా బుమ్రా ఈ ఘనత అందుకున్నాడు. దీంతో టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన మూడవ భారత బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు.

Story first published: Monday, September 2, 2019, 18:10 [IST]
Other articles published on Sep 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+