ప్లాష్‌బాక్: ఆఖరి బంతికి రెండు పరుగులు: అశ్విన్ రనౌట్, మ్యాచ్ డ్రా

హైదరాబాద్: ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. మొదటి రెండు టీ20లు ఫ్లోరిడా వేదికగా జరగనుండగా... ఆ తర్వాత సిరిస్‌లోని అన్ని మ్యాచ్‌లు కరేబియన్ దీవుల్లో జరగనుంది.
కాగా, ఆగస్టు 22 నుంచి ఇరు జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇరు జట్లకు ఇదే తొలి సిరిస్. దీంతో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ గడ్డపై టెస్టు సిరిస్‌ను నెగ్గాలని ఊవిళ్లూరుతోంది(2006 తర్వాత వరుసగా నాలుగో టెస్టు సిరిస్ ఇది).
2002 తర్వాత టీమిండియాపై వెస్టిండిస్ జట్టు ఒక్క టెస్టు సిరిస్‌ను కూడా గెలవలేదు. అయితే, ఇరు జట్ల మధ్య గతంలో జరిగిన టెస్టు సిరిస్‌లో అనేక అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాంటి సంఘటనే నవంబర్, 2011న ముంబై వేదికగా జరిగిన మూడో టెస్టులో చోటు చేసుకుంది. ఆ సంఘటన మీ కోసం...

భారత పర్యటనకు వెస్టిండిస్ జట్టు
డారెన్ సామీ నేతృత్వంలోని వెస్టిండిస్ జట్టు అప్పట్లో భారత పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా ముంబై టెస్టుకు ముందు ఢిల్లీ, కోల్‌కతాలలో జరిగిన రెండు టెస్టుల్లోనూ వెస్టిండిస్ ఓడిపోయింది. ఇక, వాంఖడె ఆతిథ్యమిచ్చిన మూడో టెస్టులో టాస్ గెలిచిన వెస్టిండిస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. డారెన్ బ్రావో(166)తో చెలరేగగా... మరో ఐదుగురు బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో వెస్టిండిస్ జట్టు 184.1 ఓవర్లలో 590 పరుగులు చేసింది.

అశ్విన్ అరంగేట్ర టెస్టులో
ఈ టెస్టు సిరిస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రవిచంద్రన్ అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 135.4 ఓవర్లకు గాను 482 పరుగులు చేసి ఆలౌటైంది. భారత జట్టులో రవిచంద్రన్ అశ్విన్(103) పరుగులతో సెంచరీ సాధించాడు. కేవలం మూడో ఇన్నింగ్స్‌లోనే అశ్విన్ సెంచరీ నమోదు చేశాడు.

134 పరుగులకే విండిస్ ఆలౌట్
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్(4/34), ప్రజ్ఞాన్ ఓజా(6/47)తో చెలరేగడంతో వెస్టిండిస్ 134 పరుగులకే ఆలౌటైంది. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో కైవసం చేసుకోవడానికి టీమిండియాకు 243 పరుగులు చేయాలి. చేధనలో ఆరంభంలోనే టీమిండియా కష్టాల్లో పడింది. అయితే, విరాట్ కోహ్లీ(63) పరుగులతో మళ్లీ రేసులోకి వచ్చింది.

ఆఖరి బంతికి రెండు పరుగులు
239 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. దీంతో టీమిండియా విజయానికి ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో అశ్విన్(14), 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వరుణ్ ఆరోన్‌లు ఉన్నారు. అయితే, ఆఖరి బంతికి రెండో పరుగు తీసే క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ రనౌటయ్యాడు. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయినప్పటికీ మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది.

టెస్టు క్రికెట్ చరిత్రలోనే రెండోసారి
టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్ స్కోర్లు సమం అయి డ్రాగా ముగియడం ఇది రెండోసారి. అంతముందు 1996లో బులవాయో వేదికగా జింబాబ్వే-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ కూడా స్కోర్లు సమం అయిన కారణంగా డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ రాణించిన రవిచంద్రన్ అశ్విన్‌కు మ్యాన్ ఆప్ ద మ్యాచ్, సిరిస్ అవార్డులు లభించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications