
పశ్చిమబెంగాల్: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కలకత్తాలోని అలిపోర్ కోర్టు షమీపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. షమీతో పాటు అతడి సోదరుడు హసిద్ అహ్మద్‌కు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇద్దరు 15 రోజుల్లో కోర్టు ఎదుట లొంగిపోవాలని అలిపోర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మహ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ పెట్టిన గృహ హింస కేసులో 15 రోజుల్లో కోర్టు ఎదుట లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 15 రోజులు గడువు ఇచ్చింది. ఒకవేళ ఈ 15 రోజుల సమయంలో కోర్టు ఎదుట హాజరుకాని పక్షంలో షమీ, అతని సోదరుడిని అరెస్ట్ చేయనున్నారు. షమీ ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్నాడు. చివరి టెస్టులో అతను ఆడుతున్నాడు. 2019 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత్ తరఫున షమీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.