హ్యాట్రిక్ ఘనత కోహ్లీదే:
మ్యాచ్ అనంతరం బుమ్రాను కోహ్లీ ఇంటర్వ్యూ చేశాడు. హ్యాట్రిక్ పడగొట్టినందుకు కంగ్రాట్స్ చెప్పిన కోహ్లీతో బుమ్రా ఈ హ్యాట్రిక్ ఘనత నీకే చెందుతుందన్నాడు. వెంటనే కోహ్లీ పెద్దగా నవ్వాడు. 'చేస్‌ను ఎల్బీగా ఔట్ అయిన సమయంలో ఏం జరిగిందో నిజంగా నాకు తెలియదు. నేను ఎల్బీ కోసం అప్పీల్ చేద్దామని అనుకోలేదు. కానీ.. కోహ్లీ సమీక్ష కోరడం మంచిదయింది. నా హ్యాట్రిక్ ఘనత కోహ్లీకే దక్కుతుంది' అని బుమ్రా తెలిపాడు.

మూడవ భారత బౌలర్‌గా బుమ్రా:
టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున బుమ్రా సాధించిన ఈ హ్యాట్రిక్ మూడోది. అంతకుముందు 2001లో స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ నమోదు చేయగా.. 2006లో ఇర్ఫాన్ పఠాన్ పాక్‌పై హ్యాట్రిక్ రికార్డు సాధించాడు. మళ్లీ 13 ఏళ్ల తర్వాత తాజాగా బుమ్రా ఈ ఘనత అందుకున్నాడు. దీంతో టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన మూడవ భారత బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు.

5 వికెట్లు.. 5వ సారి:
భారత్ ఆలౌట్ అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్‌ను బుమ్రా బెంబేలెత్తించాడు. బుమ్రా కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. బ్రాత్‌వైట్ (4), క్యాంప్‌బెల్ (2), డారెన్ బ్రేవో(4), బ్రూక్స్ (0), రోస్టన్ ఛేజ్(0), హోల్డర్ (18)లు బుమ్రా బౌలింగ్ ధాటికి బలయ్యారు. బుమ్రా ధాటికి ఇద్దరూ బ్యాట్స్‌మెన్ పరుగులేమి చేయకుండా వెనుదిరగగా.. మరో ఇద్దరు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కాగా బుమ్రా ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించడం ఇది 5వ సారి.


Click it and Unblock the Notifications












