కోల్‌కతా: ఈడెన్ గార్డెన్‌లో జరిగిన ట్వంటీ 20 ప్రపంచ కప్ మ్యాచులో ఇంగ్లాండ్ బౌలర్ పైన తిట్ల వర్షం కురిపించిన విండీస్ ఆటగాడు మార్లన్ సామ్యూల్స్ పైన ఐసీసీ భారీ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించింది.
చివరి ఓవర్ వేసిన బెన్ స్టోర్స్‌ను మార్లోన్ సామ్యూల్స్ తిట్టాడు. అతడిని ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆటగాళ్లు, వారి సిబ్బంది కోసం ఉద్దేశించిన ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అతను ఉల్లంఘించినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇంగ్లాండ్ బౌలర్ల పైన సామ్యూల్స్ అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు మొదట ఫీల్డ్ ఎంపైర్లు ధర్మసేన, రాడ్ టకర్, థర్డ్ ఎంపైర్ ఎరాస్మస్, ఫోర్త్ ఎంపైర్ ఆక్సెన్ ఫర్డ్ అభియోగాలు మోపారు. వీటిని సామ్యూల్స్ అంగీకరించాడు. దీంతో రిఫరీ విధించిన జరిమానాకు అంగీకరించాడు.

నేను మైక్‌లో మాట్లాడను.. బ్యాట్‌తో మాట్లాడతా
ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వార్న్‌కు మార్లోన్ శామ్యూల్స్ ఆదివారం నాడు ప్రపంచ ట్వంటీ 20 కప్ గెలిచిన అనంతరం కౌంటర్ ఇచ్చాడు. నేను మైకులో మాట్లాడనని, బ్యాటుతో సమాధానం చెబుతానని అన్నాడు. షేన్ వార్న్ తనను పదేపదే టార్గెట్ చేసుకున్నాడని కానీ, అతనికి తాను తన బ్యాటుతో సత్తా చూపించానన్నాడు.
నేను గత జనవరిలో ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఆడానని, అప్పుడు వార్న్ తనతో సమస్య అని చెప్పాడని, కానీ ఎందుకో తెలియదన్నాడు. నేను ఎప్పుడు కూడా అతని పట్ల అగౌరవంగా ప్రవర్తించలేదని చెప్పాడు. తనపై అతను నిత్యం మాట్లాడుతున్నాడన్నాడు.
వాట్ ఏ ఛేజ్!
అంతర్జాతీయ క్రికెట్‌తో ఉన్న 25 ఏళ్ల అనుబంధంలో ఎన్నో అద్భుతమైన క్షణాలను ఆస్వాదించానని, అయితే వరుసగా 6, 6, 6, 6 బాది మ్యాచును ముగించడాన్ని గతంలో చూడలేదని ఆసిస్ మాజీ స్పీన్నర్ షేన్ వార్న్.. విండీస్ ప్లేయర్ బ్రాత్ వైట్‌కు అభినందనలు తెలిపాడు. అతను ట్వీట్ చేశాడు.