Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WI VS ENG: వాట్ ఏ సిక్సు బెన్ స్టోక్స్‌.. అద్భుత సిక్స్‌తో 5వేల ర‌న్స్ పూర్తి.. వీడియో వైర‌ల్!

West Indies vs England: England all rounder Ben Stokes completed 5,000 runs with six

బార్బ‌డోస్‌: వెస్టిండీస్‌, ఇంగ్లండ్ మధ్య జ‌రుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లీష్ జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ బెన్‌స్టోక్స్ బాదిన సిక్సు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన నెటిజ‌న్లు వాట్ ఏ సిక్సు బెన్ స్టోక్స్ అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ స‌మ‌యంలో విండీస్ బౌల‌ర్ జోసెఫ్ వేసిన 114వ ఓవ‌ర్లో స్టోక్స్‌ ఈ సిక్సు బాదాడు. ఆఫ్‌సైడ్‌గా వ‌చ్చిన బంతిని స్టోక్స్‌ స్ట్రేట్‌గా భారీ సిక్సు బాదాడు. ఇది కాస్త భారీ ఎత్తుగా వెళ్లి ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో ప‌డింది. ఇది చూసిన కామెంటేట‌ర్లు సైతం ఆశ్చ‌ర్య‌పోయారు. అంతేకాకుండా ఈ సిక్సుతో టెస్టు క్రికెట్ కెరీర్లో స్టోక్స్ 5 వేల ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో సిక్సు బాది 5 వేల ప‌రుగులు పూర్తి చేసిన ఆట‌గాడిగా స్టోక్సు రికార్డు సృష్టించాడు.

సిక్సే కాకుండా ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ సెంచరీతో చెల‌రేగాడు. వ‌న్డే త‌ర‌హా బ్యాటింగ్‌తో క‌రేబియన్ల‌కు చుక్క‌లు చూపించాడు. 11 ఫోర్లు, 6 సిక్సుల‌తో కేవ‌లం 128 బంతుల్లోనే 120 ప‌రుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ ఏకంగా 93గా ఉండ‌డం గ‌మ‌నార్హం. కెరీర్లో ఇప్ప‌టివ‌ర‌కు 78 టెస్టు మ్యాచ్‌లాడిన స్టోక్స్ 36 స‌గ‌టుతో 5036 ప‌రుగులు చేశాడు. ఇందులో 11 సెంచ‌రీలు, 26 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 258 ప‌రుగులుగా ఉంది. ఇక బౌలింగ్‌లోనూ 170 వికెట్లు తీశాడు.

ఇక ఈ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (153), ఆల్ రౌండ‌ర్ బెన్ స్టోక్స్ (120) సెంచ‌రీల‌తో చెల‌రేగ‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల న‌ష్టానికి 507 ప‌రుగుల వ‌ద్ద డిక్లేర్ చేసింది. లార్వెన్స్ కూడా 91 ప‌రుగుల‌తో రాణించాడు. క్రిస్ వోక్స్ 41, ఫోక్స్ 33, లీస్ 30, బెయిర్‌స్టో 20 ప‌రుగులు చేశారు. విండీస్ బౌల‌ర్ల‌లో పెరూమూల్ 3, రోచ్ 2, జ‌య‌దేన్, జోసెఫ్, హోల్డ‌ర్‌, బ్రాత్‌వైట్ త‌లో వికెట్ తీశారు. ఇక రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి వెస్టిండీస్ వికెట్ న‌ష్టానికి 71 ప‌రుగులు చేసింది. క్రీజులో బ్రాత్‌వైట్ (28), బ్రూక్స్ (31) ఉన్నారు.

Story first published: Friday, March 18, 2022, 11:18 [IST]
Other articles published on Mar 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+