Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

West Indies vs England: రసెల్ ఊచకోత.. ఇంగ్లాండ్‌ను భయపెట్టాడు!

వెస్టిండీస్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ హోరాహోరీగా సాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ఇంగ్లాండ్ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్ రేసులోకి వచ్చింది.ట్రిండాడ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో ఇంగ్లాండ్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగింది. రన్స్ పరంగా ఇంగ్లాండ్ భారీ విజయం సాధించినా రసెల్ మాత్రం విధ్వంసం సృష్టించాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయి 267 పరుగులు సాధించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (119; 57 బంతుల్లో) వరుసగా మరో సెంచరీ బాదాడు. జోస్ బట్లర్ (55; 29 బంతుల్లో) అర్ధశతకం సాధించాడు.వీరిద్దరు కలిసి పది ఓవర్లలోనే 117 పరుగులు జోడించారు. బట్లర్ ఔటైన తర్వాత వచ్చిన విల్ జాక్స్ (24; 9 బంతుల్లో) బౌండరీల మోత మోగించినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. నాలుగోస్థానంలో వచ్చిన లివింగ్‌స్టోన్ (54; 21 బంతుల్లో) కూడా చెలరేగడంతో ఇంగ్లాండ్ భారీస్కోరు సాధించింది.

West Indies vs England: Andre Russell scared the England team

268 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడం ఏ జట్టుకైనా అసాధ్యమే. కానీ భారీ హిట్టర్లు ఉన్న వెస్టిండీస్‌ను తక్కువ అంచనా వేయలేం. అంతేగాక స్వదేశంలో ఆడుతున్న విండీస్ మంచి ఫామ్‌లో ఉంది. అయితే వెస్టిండీస్‌కు పేలవ ఆరంభం దక్కింది. 32 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. కానీ వచ్చిన వారంతా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ వెనుదిరిగారు. దీంతో 8 ఓవర్లలోపే అయిదు వికెట్లు కోల్పోయి 100 పరుగులు దాటింది.

ఈ దశలో రసెల్ (51; 25 బంతుల్లో) క్రీజులోకి వచ్చాడు. కానీ మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోతున్నారు. 120/7తో జట్టు ఓటమి ఖరారైపోయింది. కానీ వెస్టిండీస్ 15.3 ఓవర్లలో 192 పరుగులు చేసి ఆలౌటైంది. స్కోరు 150 దాటడమే కష్టం అనుకుంటే 200 వరకు చేరిందంటే రసెలే కారణం. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. కానీ ఆఖరి వికెట్‌గా టోప్లి బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

అయితే మ్యాచ్ అనంతరం రసెల్ ఇన్నింగ్స్ గురించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న సాల్ట్ మాట్లాడాడు. రసెల్‌ విధ్వంసాన్ని ఎవరూ ఊహించలేరని, అతడు ఔటైనందకు సంతోషించామని అన్నారు. ఎందుకంటే విండీస్ 15.3 ఓవరల్లోనే కుప్పకూలింది. మరికొన్ని ఓవర్లు రసెల్ క్రీజులో ఉంటే ఫలితం మరోలా వచ్చే అవకాశం ఉంది.

Story first published: Wednesday, December 20, 2023, 13:06 [IST]
Other articles published on Dec 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+