Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డే, టీ20ల్లో హ్యాట్రిక్‌ సాధించిన ఏకైక మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకి 'మెగాన్‌ షుట్‌'

West Indies vs Australia: Megan Schutt makes history with second white-ball hat-trick

ఆంటిగ్వా: మహిళల క్రికెట్‌లో ఆ్రస్టేలియా స్టార్ పేసర్‌ 'మెగాన్‌ షుట్‌' అరుదైన ఘనతను నమోదు చేసింది. వన్డే, టీ20ల్లో హ్యాట్రిక్‌ సాధించిన ఏకైక మహిళా క్రికెటర్‌గా మెగాన్‌ షుట్‌ నిలిచింది. బుధవారం ఆంటిగ్వాలో వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో షుట్‌ హ్యాట్రిక్‌ సాధించింది. విండీస్‌ ఇన్నింగ్స్‌ 50వ ఓవర్‌ చివరి మూడు బంతులకు ఆమె మూడు వికెట్లు తీసింది. ఆసీస్‌కు వన్డేల్లో ఇదే తొలి హ్యాట్రిక్‌.

మెగాన్‌ షుట్‌ హ్యాట్రిక్‌:

మెగాన్‌ షుట్‌ హ్యాట్రిక్‌:

మొదటగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 180 పరుగులు చేసింది. వెస్టిండీస్ మహిళలు పేలవమైన బ్యాటింగ్ ఫామ్ కొనసాగించారు. మెగ్ లాన్నింగ్, ఎల్లిస్ పెర్రీ దాటికి వెస్టిండీస్‌ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఇన్నింగ్స్‌ 50వ ఓవర్‌ చివరి మూడు బంతులకు మెగాన్‌ షుట్‌ మూడు వికెట్లు తీసింది. కిషోనా నైట్ 40, చినెల్లె హెన్రీ 39లు రాణించారు. మెగాన్‌ షుట్‌ మూడు వికెట్లు.. జెస్ జోనాసెన్, ఆష్లీ గార్డనర్ తలో రెండు వికెట్లు తీశారు.

అలిస్సా అర్ధ సెంచరీ:

అలిస్సా అర్ధ సెంచరీ:

అనంతరం మోస్తరు లక్ష్య చేధనకు దిగిన ఆసీస్ కేవలం 31.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అలిస్సా హీలీ 32 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మెగ్ లాన్నింగ్ కూడా అర్ధ సెంచరీతో రాణించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్‌ చేసింది. ఇటీవలి ఆసీస్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ 15 మ్యాచ్‌లను అజేయంగా గెలిచింది. అంతేకాదు ఐదవ వరుస సిరీస్‌ను కూడా గెలుచుకుంది.

ఆసీస్‌కు మొదటి హ్యాట్రిక్‌:

ఆసీస్‌కు మొదటి హ్యాట్రిక్‌:

మెగాన్‌ షుట్‌ 'హ్యాట్రిక్‌'.. ఆసీస్‌కు వన్డేల్లో ఇదే మొదటిది. గతేడాది భారత్‌తో ముంబైలో జరిగిన టీ20 మ్యాచ్‌లో కూడా ‘హ్యాట్రిక్‌' తీసిన ఘనత మెగాన్‌ సొంతం. తద్వారా అంతర్జాతీయ వన్డేలు, టి20ల్లో ‘హ్యాట్రిక్‌' సాధించిన ఏకైక మహిళా క్రికెటర్‌గా మెగాన్‌ షుట్‌ రికార్డులకెక్కింది.

Story first published: Thursday, September 12, 2019, 11:33 [IST]
Other articles published on Sep 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+