కాన్‌బెర్రా: ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా జింబాబ్వే-వెస్టిండిస్ మధ్య కాన్‌బెర్రాలో జరిగిన వన్డే మ్యాచ్‌లో వెస్టిండిస్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ డబుల్ సెంచరీ సాధించాడు.
క్రిస్ గేల్ డబుల్ సెంచరీ చేయడంలో మ్యాచ్‌లోని 40 ఓవర్ కీలక పాత్ర పోషించిందనే చెప్పొచ్చు. పన్యగర వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్లో వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్ మన్ గేల్ క్యాచ్ రూపంలో అవుటయ్యాడు. దీంతో క్రిస్ గేల్‌ను అవుట్ చేశామని జింబాబ్వే ఆటగాళ్లు సంతోషపడ్డారు.
అయితే అంపైర్ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. దీంతో క్రిస్ గేల్ నాటౌట్‌గా మిగిలిపోయి.... 138 బంతుల్లో (16 సిక్స్‌లు , 9 ఫోర్లు)తో చెలరేగి పోయి 215 పరుగులు చేశాడు. క్రిస్ గేల్‌కు వన్డేల్లో ఐదవ డబుల్ సెంచరీ. వరల్డ్ కప్‌లో తొలి డబుల్ సెంచరీ.
విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా పేరున్న గేల్ గత కొంత కాలంగా ఫామ్‌లో లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు. చివరి సారిగా 2013లో శ్రీలంకపై (109) సెంచరీ సాధించాడు. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టి జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు.

వరల్డ్ కప్‌లో గ్యారీ కిరెస్టన్(188) పేరుమీదన్న రికార్డును క్రిస్ గేల్ అధిగమించాడు. 1996లో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన కిర్‌స్టన్ 188 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయేతరుడిగా గేల్ చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా, ప్రపంచకప్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడు గేల్.
వరల్డ్ కప్ 2015లో మరో రికార్డు నమోదు అయ్యింది. వీరిద్దరూ కలిసి వరల్డ్ కప్‌లో అత్యధిక రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రాహుల్ ద్రవిడ్, గంగూలీల పేరిట ఉన్న 318 పరుగుల అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని ఈ బద్దలు కొట్టారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 320 పరుగులు జోడించారు.