For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్‌ టూర్.. టీమిండియాలో మరో 'బ్రదర్స్‌' జోడీ

Team India's West Indies Tour 2019 : Rahul Chahar Joins Brother Deepak In India's T20 Squad
West Indies tour: Rahul Chahar joins brother Deepak Chahar in Indias T20 squad

టీమిండియా తరఫున మరో బ్రదర్స్‌ జోడీ బరిలోకి దిగనున్నారు. ఆగస్టు 3 నుండి ప్రారంభం కానున్న వెస్టిండీస్‌ పర్యటనకు భారత జట్లను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ టీ20 సిరీస్‌కు అన్నదమ్ములైన దీపక్‌ చాహర్‌, రాహుల్‌ చాహర్‌లను ఎంపిక చేశారు. రాహుల్‌ భారత జట్టుకు ఎంపికవడం ఇదే తొలిసారి. అయితే దీపక్‌ చాహర్‌ ప్రపంచకప్‌లో పాల్గొన్న భారత ఆటగాళ్లకు నెట్ బౌలింగ్ చేసాడు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

తుది జట్టులో చోటు దక్కితే:

తుది జట్టులో చోటు దక్కితే:

వెస్టిండీస్‌ టీ20 సిరీస్‌ తుది జట్టులో దీపక్‌ చాహర్‌, రాహుల్‌ చాహర్‌లకు అవకాశం లభిస్తే భారత్‌ తరఫున నాలుగో అన్నదమ్ముల జోడీగా రికార్డుకెక్కుతారు. అంతకుముందు మోహిందర్‌ అమర్‌నాథ్‌, సురీందర్‌ అమర్‌నాథ్‌.. ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసఫ్‌ పఠాన్‌.. హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య సోదరులు టీమిండియా తరఫున ఆడారు.

పొదుపుగా బౌలింగ్‌:

పొదుపుగా బౌలింగ్‌:

రాజస్థాన్‌కు చెందిన రాహుల్‌ చాహర్‌, దీపక్‌ చాహర్‌లు ఐపీఎల్-12లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో వెస్టిండీస్‌ పర్యటనకు ఎంపిక అయ్యారు. తమ్ముడు రాహుల్‌ చాహర్‌ ముంబై ఇండియన్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. సీజన్‌-12లో 13 వికెట్ల తీసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ముఖ్యంగా ఈ యువ స్పిన్నర్‌ ఎంతో పొదుపుగా బౌలింగ్‌ చేయగలడు. ఫైనల్ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసాడు.

కీలక బౌలర్‌గా సేవలు:

కీలక బౌలర్‌గా సేవలు:

అన్నయ్య దీపక్‌ చాహర్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. జట్టులో కీలక బౌలర్‌గా సేవలందించాడు. తన పేస్‌తో జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. కెప్టెన్ ధోనీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని 100 శాతం నిలబెట్టాడు. ఫైనల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. మొత్తం 22 వికెట్లతో చెన్నై తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. టోర్నీలో మాత్రం మూడవ బౌలర్‌గా నిలిచాడు.

టీ20 జట్టు:

టీ20 జట్టు:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్ పంత్‌ (వికెట్‌ కీపర్‌), కృనాల్‌ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌సైనీ.

Story first published: Monday, July 22, 2019, 11:55 [IST]
Other articles published on Jul 22, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+