Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గెలుపు గుర్రాలు వేరుగా ఉంటాయి: గంగూలీ ఆలోచనలను ఏకీభవించని వినోద్‌ కాంబ్లీ

Vinod Kambli Disagrees With Sourav Ganguly’s Opinion ! || Oneindia Telugu
West Indies tour 2019: same players in all formats: Vinod Kambli disagrees with Sourav Ganguly idea

మూడు ఫార్మాట్లకు ఒకే జట్టును ప్రకటిస్తే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగి మంచి ప్రదర్శన చేయడానికి అవకాశం ఉంటుందని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఆలోచనలను మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ ఏకీభవించలేదు. ఆగస్టు 3 నుండి ప్రారంభం కానున్న వెస్టిండీస్‌ పర్యటనకు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ మూడు జట్లను ప్రకటించింది. నలుగురు ఆటగాళ్లు మాత్రమే మూడు జట్లలో చోటు దక్కించుకున్నారు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

గుంగూలీ అసంతృప్తి:

గుంగూలీ అసంతృప్తి:

వన్డే జట్టులో వెస్టిండీస్‌-ఏ జట్టుతో జరిగిన ఐదు వన్డేల అనధికారిక సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం ఇవ్వకపోవడం, సీనియర్ బ్యాట్స్‌మన్‌ అజింక్య రహానేను కేవలం టెస్టులకు మాత్రమే ఎంపిక చేయడం తనను ఆశ్చర్యంకు గురిచేసింది అని గంగూలీ అన్నారు. అంతేకాదు సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసిన టీమిండియా జట్లపై అసంతృప్తి గుంగూలీ వ్యక్తం చేశారు.

అన్ని ఫార్మాట్లకు ఒకే ఆటగాళ్ళు:

అన్ని ఫార్మాట్లకు ఒకే ఆటగాళ్ళు:

'భారత సెలెక్టర్లు అన్ని ఫార్మాట్‌లకు ఒకే ఆటగాళ్లను ఎంపిక చేసే సమయం ఆసన్నమైంది. దీంతో ఆటగాళ్లు మరింత విశ్వాసంతో ఆడుతారు. ప్రస్తుతం చాలా తక్కువ మంది ఆటగాళ్లు మాత్రమే మూడు ఫార్మాట్‌ల్లో ఆడుతున్నారు. గొప్ప జట్లలో ఆటగాళ్లు స్థిరంగా ఉంటారు. అందరిని సంతోషపరచడానికి జట్టును ఎంపిక చేయకూడదు. దేశానికి ఉత్తమ జట్టుని సెలెక్ట్ చేయాలి అన్ని ఫార్మాట్లలలో ఆడగల చాలా మంది జట్టులో ఉన్నారు. గిల్‌కు వన్డే జట్టులో అవకాశం ఇవ్వకపోవడం, రహానెను కేవలం టెస్టులకు మాత్రమే ఎంపిక చేయడం ఆశ్చర్యంకు గురిచేసింది' అని గంగూలీ ట్వీట్‌ చేశారు.

గెలుపు గుర్రాలు వేరుగా ఉంటాయి;

గెలుపు గుర్రాలు వేరుగా ఉంటాయి;

కాంబ్లీ స్పందిస్తూ.. 'గెలుపు గుర్రాలు వేరు వేరుగా ఉంటాయి. ప్రతి ఫార్మాట్ కోసం ఉత్తమ ఆటగాళ్లను ఎన్నుకోవాలి. వారినే ఆడించాలి. మూడు ఫార్మాట్లకు వేర్వేరు ఆటగాళ్లను ఎంపిక చేయడం సరైనదే. దీంతో ప్రధాన సిరీస్‌ల్లో ఎవరిని ఏ సందర్భంలో వాడుకోవాలో తెలుస్తుంది. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లే ఉదాహరణ' అని కాంబ్లీ ట్వీట్ చేశారు.

Story first published: Thursday, July 25, 2019, 15:48 [IST]
Other articles published on Jul 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+