కోహ్లీ, రోహిత్ మధ్య విబేదాలు: అనుష్క శర్మను కూడా అన్‌ఫాలో చేసిన రోహిత్

ప్రపంచకప్‌లో సెమీస్ ఓటమి అనంతరం భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విబేధాలు తలెత్తాయని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు జట్టును గ్రూపులుగా విభజించి రాజకీయాలు చేస్తున్నారని పుకార్లు హల్‌చల్ చేసాయి. ఇదిలా ఉండగానే.. విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న కోహ్లీ విండీస్ పర్యటనకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలని భావించాడు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

సారధ్య భాద్యతలు పోతాయనే:
ఇదే సమయంలో వన్డే, టీ20లకు కెప్టెన్‌గా రోహిత్ శర్మను.. టెస్ట్‌లకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని నియమించాలనే అభిప్రాయాలు వచ్చాయి. రోహిత్ శర్మకి కెప్టెన్సీని అప్పగించడం ఇష్టం లేని కోహ్లీ మనసు మార్చుకుని.. తనకు విశ్రాంతి అవసరం లేదని, విండీస్ పర్యటనకు అందుబాటులో ఉంటానని తెలిపాడు. సారధ్య భాద్యతలు పోతాయనే కోహ్లీ విశ్రాంతి తీసుకోలేదని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు తప్పని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

అనుష్కను అన్‌ఫాలో చేసిన రోహిత్:
కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కోహ్లీ, రోహిత్‌ల మధ్య విబేధాలు నిజమే అని అనిపిస్తోంది. గత సంవత్సరమే విరాట్ కోహ్లీని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిన రోహిత్ శర్మ.. తాజాగా బాలీవుడ్ హీరోయిన్, కోహ్లీ భార్య అనుష్క శర్మను కూడా అన్‌ఫాలో అయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య తలెత్తిన విబేధాలు నిజమేనని భావిస్తున్నారు.

రితికను ఫాలో అవుతున్న కోహ్లీ:
మరోవైపు కోహ్లీ, అనుష్కలు ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ శర్మను ఫాలో అవుతున్నారు. కోహ్లీ, రోహిత్ ట్విట్టర్లో ఒకరినొకరు ఫాలో కావడం లేదు. కానీ.. కోహ్లీ మాత్రం రోహిత్ భార్య రితికను ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు గానీ సోషల్ మీడియాలో అనుష్కని రోహిత్ అన్‌ఫాలో చేశాడన్న వార్తలు ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీశాయి. వీరిద్దరి మధ్య ఏం జరిగిందంటూ నెట్టింట్లో అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

భిన్నాభిప్రాయాలు ఉంటాయి:
జట్టులో ఆటగాళ్ల మధ్య భేదాభిప్రాయాలు సహజమే అని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పేర్కొన్నారు. 'ప్రతి విషయంపై జట్టులోని ఆటగాళ్ల అందరికి ఒకేలా అభిప్రాయాలు ఉండవు. జట్టు కూర్పు, వ్యూహాలపై వాద ప్రతివాదాలు, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. కానీ.. చివరకు అందరూ ఒకే నిర్ణయానికి వస్తారు' అని భరత్ తెలిపాడు. అన్ని విషయాలను అందరూ అంగీరించలేరు అని అభిప్రాయపడ్డారు.

ఆందోళన అవసరం లేదు:
'రోహిత్ తరచూ కోహ్లీతో చర్చలు జరుపుతాడు. ఇద్దరు బాగా కలిసిపోతారు. ఒకరి సామర్థ్యం గురించి మరొకరు ప్రశంసలు చేసుకుంటారు. కోహ్లీ జట్టును బాగా నడిపించాడు. కెప్టెన్‌గా పరిపక్వం చెందుతున్నాడు. అతనికి మద్దతుగా రోహిత్ ఉండటం ఆనందంగా ఉంది. కోహ్లీ, రోహిత్ సంబంధాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని అరుణ్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications