India vs West Indies: విండీస్ జట్టులో కీలక మార్పులు.. భారత పర్యటనకు టీం ఎంపిక

భారత పర్యటనలో వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన జట్టును వెల్లడించింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు కెమర్ రోచ్, న్క్రుమా బోన్నర్, బ్రాండన్ కింగ్ చాలా కాలం తర్వాత వన్డే జట్టుకు ఎంపికయ్యారు. కెమర్ రోచ్ రెండున్నరేళ్ల తర్వాత వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. అతను తన చివరి వన్డే మ్యాచ్‌ను 2019లో భారత్‌పైనే ఆడాడు.
మళ్లీ భారత్‌పై రీఎంట్రీ ఇస్తున్నాడు. న్క్రుమా బోన్నర్, డారెన్ బ్రావో రాకతో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. ఈ జట్టును ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డు నడిపించనున్నాడు. ఐర్లాండ్‌తో సొంత గడ్డపై వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ ఓడిన తర్వాత ఆ జట్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

కొత్త సెలెక్టర్ జట్టు ఎంపిక
కాగా వెస్టిండీస్ నూతన సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ తొలిసారి జట్టును ఎంపిక చేశాడు. అంతకు ముందు ఉన్న రోజర్ హార్పర్ స్థానంలో డెస్మండ్ హేన్స్ సెలెక్టర్‌గా ఈ మధ్యనే బాధ్యతలు చేపట్టాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023లో భారత్ వేదికగా జరగనున్న ప్రపంచకప్ లక్ష్యంగా ఈ జట్టును ప్రకటించినట్టు చెప్పాడు. కాగా ప్రస్తుతం ప్రకటించిన వెస్టిండీస్ జట్టు వన్డే సిరీస్ వరకే అని ఆయన వెల్లడించాడు.
టీ20 సిరీస్‌కు విండీస్ జట్టును శుక్రవారం ప్రకటించనున్నట్లు చెప్పాడు. కాగా ఫిబ్రవరి 6, 9, 11వ తేదీల్లో అహ్మదాబాద్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఇక కోల్‌కతా వేదికగా ఫిబ్రవరి 16, 18, 20వ తేదీలలో ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ జరగనుంది.

వెస్టిండీస్ జట్టు
కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఫాబియన్ అలెన్, న్క్రుమా బోన్నర్, డారెన్ బ్రేవో, షమర్ బ్రూక్స్, జేసన్ హోల్డర్, షాయ్ హోప్, అకెల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, కెమర్ రోచ్, రొమారియో స్మిత్, హేడెన్ షెపర్డ్, ఒడియాన్డెన్, వాల్ష్ జూనియర్.

భారత జట్టు ఎంపిక
కాగా వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు సెలెక్టర్లు భారత జట్టును బుధవారం ప్రకటించారు. మొత్తం 18 మందితో కూడిన జట్టును వెల్లడించారు. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు.

భారత వన్డే జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్‌కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హూడా, రిషబ్ పంత్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్లన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, అవేశ్‌ఖాన్.

భారత టీ20 జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్‌కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, చాహల్, సుందర్, సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేశ్, హర్షల్ పటేల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications