IPL 2021: టీ20 ప్రపంచకప్‌లో చోటు.. అయినా ఐపీఎల్‌లో నెట్‌ బౌలర్లుగా విండీస్ పేసర్లు! కారణం ఏంటంటే?

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశకు సమయం దగ్గరపడుతోంది. యూఏఈలో మరో ఐదు రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం కానుంది. ఇందుకోసం దుబాయ్‌, షార్జా, అబుదాబి మైదానాలు సిద్ధమయ్యాయి. బయో బుడగలో ఉన్న ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడటంతో మే మొదటి వారంలో ఈ మెగా టోర్నీ వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2021 కోసం ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు యూఏఈ చేరుకొని ప్రాక్టీస్ మొదలెట్టగా.. ఇంగ్లండ్ సిరీసులో పాల్గొన్న భారత ప్లేయర్స్ అందరూ ఆదివారం దుబాయ్ చేరుకుని క్వారంటైన్ అయ్యారు. సెప్టెంబరు 19న చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

భవిష్యత్‌లో టెక్నాలజీనే కీలకం.. క్రీడల్లోనూ ఓటీటీలు వస్తాయి: అనిల్ కుంబ్లేభవిష్యత్‌లో టెక్నాలజీనే కీలకం.. క్రీడల్లోనూ ఓటీటీలు వస్తాయి: అనిల్ కుంబ్లే

నెట్‌ బౌలర్లుగా విండీస్ పేసర్లు:

నెట్‌ బౌలర్లుగా విండీస్ పేసర్లు:

ఐపీఎల్‌ 2021 సెకెండ్‌ ఫేజ్‌లో వెస్టిండీస్ ప్లేయర్స్ రవి రాంపాల్, ఫీడెల్ ఎడ్వర్డ్స్,షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్ నెట్ బౌలర్లుగా వ్యవహరించబోతున్నారు. అయితే ఈ ఆటగాళ్లు ఏ జట్లలో చేరే అవకాశం ఉందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఏ ప్రాంచైజీ కూడా ఈ బౌలర్లను తీసుకుంటున్నట్లు అధికారిక ప్రకటన చేయలేదు. కాగా అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు నెట్‌ బౌలర్లుగా పాల్గొనడం గమనార్హం. ఇటీవల వెస్టిండీస్ ప్రకటించిన 15 మంది సభ్యుల టీ20 ప్రపంచకప్ జట్టులో రాంపాల్‌కు చోటు దక్కింది. ప్రస్తుతం ఈ నలుగురు కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2021లో ఆడుతున్నారు.

యూఏఈ తరహా పిచ్‌లే:

యూఏఈ తరహా పిచ్‌లే:

దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత పేసర్ రవి రాంపాల్‌కు వెస్టిండీస్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కింది. 2010 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన విండీస్ జట్టులో సభ్యుడిగా ఉన్న 36 ఏళ్ల రవి రాంపాల్‌.. చివరగా టీ20 ప్రపంచకప్‌ 2015లో ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో 18 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఈ ప్రదర్శనతోనే అతడు ప్రపంచకప్‌ జట్టులోకి వచ్చాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంత్‌తో పాటు వికెట్లు పడగొట్టడం రవి రాంపాల్‌ ప్రత్యేకత. జాతీయ జట్టుకు ఆడిన సమయంలో అతడు స్టార్ పేసర్‌గా కొనసాగాడు. ప్రపంచకప్‌ యూఏఈ తరహా పిచ్‌లపైనే జరగనున్న నేపథ్యంలో రవి రాంపాల్‌ ఐపీఎల్‌లో నెట్‌ బౌలర్‌గా కొనసాగనున్నాడు.

ప్రాక్టీస్‌ కోసమే:

ప్రాక్టీస్‌ కోసమే:

రవి రాంపాల్ ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిబాగో నైట్ రైడర్స్‌ తరఫున ఆడుతున్నాడు. రవి గతంలో 2013-14 సీజన్లలో బెంగూళూరు రాయల్ ఛాలెంజర్స్‌ తరుపున ఆడాడు. మరో వైపు ఫీడెల్ ఎడ్వర్డ్స్,షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్ కూడా కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ 2021లో ఆడుతున్నారు. కాట్రెల్ రిజర్వ్ ఆటగాడిగా ఎంపికయ్యాడు. 2020 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడిన కాట్రెల్‌ 6 వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్ యూఏఈ, ఒమన్‌లో జరగనున్న నేపథ్యంలో ప్రాక్టీస్‌ కోసమే విండీస్ బౌలర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులోనూ యూఏఈ తరహా పరిస్థితులే అక్కడ ఉండనున్న నేపథ్యంలో ఐపీఎల్ ఆడేందుకు వారు సముఖంగా ఉన్నారు.

పొలార్డ్‌ నాయకత్వంలో:

పొలార్డ్‌ నాయకత్వంలో:

వెస్టిండీస్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టులో విండీస్ మాజీ కెప్టెన్‌, స్టార్ ఆల్‌రౌండర్‌ జాసన్‌ హోల్డర్‌కు చోటు దక్కలేదు. అయితే అతనికి రిజర్వ్‌ ఆటగాళ్ల జాబితాలో స్థానం కల్పించారు. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్‌కు కూడా పొట్టి ప్రపంచకప్‌లో చోటు దక్కలేదు. అయితే హెడెన్‌ వాల్ష్‌ జూనియర్‌కు విండీస్ జట్టులో చోటు దక్కింది. సీనియర్ ఆటగాళ్లు క్రిస్‌ గేల్‌, డ్వేన్‌ బ్రేవో, ఆండ్రీ రసెల్‌ తమ స్థానాలను నిలుపుకున్నారు. డిపెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న విండీస్‌ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ నాయకత్వం వహించనున్నాడు. టీ20 ప్రపంచకప్‌ను రెండుసార్లు గెలుచుకున్న ఏకైక జట్టు అయిన వెస్టిండీస్ టీంలో జట్టునిండా హిట్టర్లే ఉన్నారు. దాంతో మరోసారి ఫెవరెట్‌గా బరిలోకి దిగుతుంది. నికోలస్‌ పూరన్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. గేల్‌, లెండిల్ సిమన్స్‌, షిమ్రన్ హెట్‌మైర్‌, రోస్టన్‌ చేజ్‌ వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తుంది. పొలార్డ్, డ్వేన్‌ బ్రేవో, ఆండ్రీ రసెల్‌, ఫాబియన్‌ అలెన్‌ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఒబేడ్ మెక్కాయ్, రవి రాంపాల్, ఒషానే థామస్, హెడెన్‌ వాల్ష్‌ రూపంలో మంచి పేసర్లు కూడా ఉన్నారు.

ఇంగ్లండ్‌తో మొదటి మ్యాచ్:

ఇంగ్లండ్‌తో మొదటి మ్యాచ్:

ప్రతీ జట్టు తమ టీంను అక్టోబర్ 10 వరకు మార్చుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని జట్లు చాలా వరకు తమ జట్టును ఫైనల్ చేశాయి. అయితే విండీస్ సీపీఎల్ 2021 అనంతరం ఏమైనా మార్పులు చేస్తుందో చూడాలి. ఇక టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌ 1లో ఉన్న వెస్టిండీస్‌ ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టను ఎదుర్కోనుంది. డెత్‌ గ్రూఫ్‌గా పరిగణిస్తున్న ఈ గ్రూఫ్‌లో విండీస్‌ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 23న ఇంగ్లండ్‌తో ఆడనుంది. ఇక పొట్టి క్రికెట్‌లో విండీస్‌ జట్టు 2010, 2016లో చాంపియన్‌గా నిలిచింది. ఈసారి కూడా కప్ కొట్టేందుకు తహతహలాడుతోంది.

వెస్టిండీస్ టీ20 జట్టు

వెస్టిండీస్ టీ20 జట్టు

కీరన్ పొలార్డ్ (కెప్టెన్‌), నికోలస్ పూరన్ (వైస్‌ కెప్టెన్‌), క్రిస్ గేల్, ఫాబియన్ అలెన్, డ్వేన్ బ్రావో, రోస్టన్ చేజ్, ఆండ్రీ ఫ్లెచర్, షిమ్రన్ హెట్‌మైర్, ఎవిన్ లూయిస్, ఒబేడ్ మెక్కాయ్, రవి రాంపాల్, ఆండ్రీ రసెల్‌, లెండెల్ సిమన్స్, ఒషానే థామస్, హెడెన్‌ వాల్ష్‌ జూనియర్‌.

స్టాండ్‌ బై ప్లేయర్లు: జాసన్‌ హోల్డర్‌, డారెన్‌ బ్రావో, షెల్డన్‌ కాట్రెల్‌, ఏకేల్ హోసిన్.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, September 14, 2021, 9:51 [IST]
Other articles published on Sep 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X