Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs West Indies: క్రిస్ గేల్‌కు మ‌ళ్లీ నిరాశే.. భార‌త ప‌ర్య‌ట‌న‌కు వెస్టిండీస్‌ టీ20 జ‌ట్టు ఎంపిక‌

West Indies T20 Team have been selected for the India tour
Lost Respect on Curtly Ambrose . Chris Gayle slams West Indies legendary cricketer

ఇప్ప‌టికే భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌న్డే జ‌ట్టు ప్ర‌క‌టించిన వెస్టిండీస్ తాజాగా టీ20 జ‌ట్టును కూడా ప్ర‌క‌టించింది. 16 మందితో కూడిన జ‌ట్టుకు సీనియ‌ర్ ప్లేయ‌ర్ కీర‌న్ పొలార్డు నాయ‌కత్వం వ‌హించ‌నున్నాడు. నికోల‌స్ పూర‌న్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు. కాగా విండీస్ త‌ర‌ఫున మ‌రొక సిరీస్ ఆడి అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాల‌ని చూస్తున్న ఆ జ‌ట్టు దిగ్గ‌జ బ్యాట‌ర్ క్రిస్ గేల్‌కు మ‌రోసారి నిరాశ‌నే ఎదురైంది. భార‌త ప‌ర్య‌ట‌న‌కు ఎంపిక చేసిన వెస్టిండీస్ జ‌ట్టులో గేల్‌కు చోటు ద‌క్క‌లేదు. అలాగే ప్ర‌స్తుతం ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ విండీస్ టీ20 జ‌ట్టునే య‌థావిధంగా భార‌త ప‌ర్య‌ట‌న‌లోని టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న వెస్టిండీస్ టీ20 జ‌ట్టు బాగా రాణిస్తోంద‌ని, అందుకే అదే జ‌ట్టును భార‌త ప‌ర్య‌ట‌న‌కు ఎంపిక చేసిన‌ట్టు విండీస్ క్రికెట్ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మన్ వెల్ల‌డించాడు.

స్పిన్న‌ర్లుగా ఫాబియన్ అలెన్, అకేల్ హోసేన్,హేడెన్ వాల్ష్ జూనియ‌ర్ ఎంపిక‌య్యారు. ఇక ఆల్‌రౌండ‌ర్‌గా తొలి సారి డొమినిక్ డ్రేక్స్‌కు జ‌ట్టులో చోటు క‌ల్పించారు. కాగా విండీస్ జ‌ట్టు భార‌త ప‌ర్య‌ట‌న ఫిబ్ర‌వ‌రి 6 నుంచి ప్రారంభం కానుంది. 6, 9, 11 తేదీల్లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా వ‌న్డే సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఇక 16, 18, 20 తేదీల్లో కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్ వేదిక‌గా టీ20 సిరీస్ జ‌ర‌గ‌నుంది. వ‌న్డే సిరీస్‌కు 15 మందితో కూడిన త‌మ జ‌ట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వ‌న్డే జ‌ట్టుకు కూడా కీర‌న్ పొలార్డే కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

వెస్టిండీస్ టీ20 జ‌ట్టు
కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరాన్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, డారెన్ బ్రేవో, రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, బ్రాండన్ కింగ్, రోవ్‌మన్ పావెల్, ఓడియన్ స్మిత్, రొమారియో షెపర్డ్, కైల్ మేయర్స్, హేడెన్ వాల్ష్ జూనియర్.

వెస్టిండీస్ వ‌న్డే జ‌ట్టు
కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఫాబియన్ అలెన్, న్క్రుమా బోన్నర్, డారెన్ బ్రావో, షమర్ బ్రూక్స్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, కెమర్ రోచ్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, హేడెన్ వాల్ష్ జూనియ‌ర్, హేడెన్.

Story first published: Sunday, January 30, 2022, 15:46 [IST]
Other articles published on Jan 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+