Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్.. !!

Sunil Narine retirement: వెస్టిండీస్ మిస్టరీ సునీల్ నరైన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మట్ల నుంచీ వైదొలిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సహా వివిధ దేశాల తరఫున టీ20 లీగ్ ఫ్రాంఛైజీల్లో కొనసాగుతానని తెలిపాడు.

దేశవాళీ వన్డేలకూ గుడ్‌బై చెప్పాడు సునీల్ నరైన్. ప్రస్తుతం అతను ట్రినిడాడ్ అండ్ టుబాగో జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు. వెస్టిండీస్‌లో సూపర్ 50 కప్‌ టోర్నమెంట్ ఆడుతున్నాడు. దీని తరువాత డొమెస్టిక్ క్రికెట్ నుంచి కూడా తప్పుకోనున్నట్లు చెప్పాడు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశాడు.

West Indies spinner Sunil Narine announced retirement from international cricket

35 సంవత్సరాల సునీల్ నరైన్.. మిస్టరీ స్నిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వెస్టిండీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2012లో టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన వెస్టిండీస్ జట్టులో అతను సభ్యుడు కూడా. ఇప్పటివరకు 65 వన్డేలు, 51 టీ20 ఇంటర్నేషనల్స్, ఆరు టెస్ట్ మ్యాచ్‌లను ఆడాడు.

చాలాకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటూ వస్తోన్నాడు సునీల్ నరైన్. ఫామ్‌లో లేకపోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. 2013లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తరువాత ఆ ఫార్మట్‌కు దూరం అయ్యాడు. 2016లో చివరి వన్డేనూ ఆడాడు. టీ20 ఫార్మట్‌లో కొనసాగినప్పటికీ.. అందులో కూడా పెద్దగా రాణించలేదు. 2019లో చివరి టీ20లో కనిపించాడు.

ఐపీఎల్‌ సహా వివిధ దేశాల తరఫున టీ20 ఫ్రాంఛైజీల్లో మాత్రం కొనసాగుతానని, ఇకపై వాటిపై దృష్టి పెడతానని సునీల్ నరైన్ వివరించాడు. కోల్‌కత నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఆడుతున్న విషయం తెలిసిందే. ఆల్ రౌండర్‌గా గుర్తింపు పొందాడు. 2012లో ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. కంటిన్యూగా 2023 సీజన్ వరకూ ఆడాడు.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు 162 మ్యాచ్‌లను ఆడాడు సునీల్. 1,046 పరుగులు చేవాడు. అతని అత్యధిక వ్యక్తిగత పరుగులు 75. 163 వికెట్లను పడగొట్టాడు. అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్.. 5/19. 2012 సీజన్‌లో అత్యధికంగా 24 వికెట్లు తీసుకున్నాడు. ఆ తరువాత కూడా అతని దూకుడు కొనసాగింది.

Story first published: Monday, November 6, 2023, 8:52 [IST]
Other articles published on Nov 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+