Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. అన్ని రికార్డులు బ్రేక్!

టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశను వెస్టిండీస్ ఘనంగా ముగించింది. సెయింట్ లూసియా వేదికగా మంగళవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై 104 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. నికోలస్ పూరన్ (98; 53 బంతుల్లో, 6 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో మొదట వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 218 పరుగులు చేసింది. ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (43; 27 బంతుల్లో, 8 ఫోర్లు) రాణించారు.

కెప్టెన్ పావెల్ (26; 15 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), షై హోప్ (25; 17 బంతుల్లో, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. గుల్బాదిన్ నైబ్ (2/14) రెండు వికెట్లు, నవీనుల్ హక్ (1/41), అజ్మతుల్లా (1/41) తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో అఫ్గానిస్థాన్ 16.2 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ (38; 28 బంతుల్లో, 5 ఫోర్లు,1 సిక్సర్) టాప్ స్కోరర్. ఒబెడ్ మెక్కాయ్ (3/14) మూడు, అకీల్ హొస్సేన్ (2/21), మొయెట్జీ (2/28) చెరో రెండు వికెట్లు తీశారు.

West Indies Sets Men s T20 World Cup Record for Highest Powerplay Score

అయితే ఈ క్రమంలో వెస్టిండీస్ పలు రికార్డులు బద్దలుకొట్టింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. అజ్మతుల్లా వేసిన నాలుగో ఓవర్‌లో పూరన్ విరుచుకుపడటంతో ఏకంగా 36 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత చార్లెస్ కూడా బ్యాటు ఝుళిపించడంతో విండీస్ పవర్‌ప్లేలో 92/1తో రికార్డు స్కోరు సాధించింది. అంతకుముందు పవర్ ప్లే అత్యధిక స్కోరు రికార్డు నెదర్లాండ్స్ పేరిట ఉండేది.

2014 వరల్డ్ కప్‌లో ఐర్లాండ్‌పై నెదర్లాండ్స్ తొలి ఆరు ఓవర్లలో 91/1 స్కోరు సాధించింది. మూడో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ 2016 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై 89/3 స్కోరు చేసింది. కాగా, పరుగుల పరంగా వెస్టిండీస్‌కు ఇది రెండో అత్యుత్తమ గెలుపు. ఈ మెగాటోర్నీలో ఉగాండపై 134 పరుగులతో నెగ్గడం మొదటి అత్యుత్తమం. ఇక టీ20ల్లో వెస్టిండీస్‌కు ఇది వరుసగా ఎనిమిదో విజయం. అంతకుముందు 2012-13 ఏడాదిలో వరుసగా ఏడు విజయాలు సాధించిన తమ రికార్డును బ్రేక్ చేసింది.

Story first published: Tuesday, June 18, 2024, 12:23 [IST]
Other articles published on Jun 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+