Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: వర్షం కారణంగా ఆగిన వెస్టిండీస్, స్కాట్లాండ్ మ్యాచ్ ..

West Indies, Scotland match stopped due to rain

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజీలో భాగంగా బెల్లెరివ్ ఓవల్ లో వెస్టిండీస్, స్కాట్లాండ్ మధ్య జరుగుతోన్న మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన స్కాట్లాండ్ 5.3 ఓవర్లో ఒక్క వికెటు కూడా కోల్పోకుండా 52 పరుగులు చేసింది. ఇంతలోనే వర్షం రావడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. జార్జ్ మున్సే 19 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. మైఖేల్ జోన్స్ 19 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే వెస్టిండీస్, స్కాట్లాండ్ కు చెరో పాయింట్ వస్తుంది.

జట్లు
వెస్టిండీస్ జట్టు: కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్(w/c), రోవ్‌మన్ పావెల్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్, యానిక్ కరియా, ఎవిన్ లూయిస్, షెల్డన్ కాట్రెల్, రేమోన్ కాట్రెల్ , షమర్ బ్రూక్స్

స్కాట్లాండ్ జట్టు: జార్జ్ మున్సే, మైఖేల్ జోన్స్, మాథ్యూ క్రాస్(w), రిచీ బెరింగ్టన్(c), క్రిస్ గ్రీవ్స్, కాలమ్ మాక్లియోడ్, మార్క్ వాట్, మైఖేల్ లీస్క్, హంజా తాహిర్, జోష్ డేవీ, సఫ్యాన్ షరీఫ్, క్రైగ్ వాలెస్, క్రిస్ సోల్, బి. , బ్రాండన్ మెక్‌ముల్లెన్

నమీబియా, నెదర్లాండ్
ఆదివారం జరిగిన నమీబియా, శ్రీలంక మ్యాచ్ లో నమీబియా విజయం సాధించింది. యూఏఈ, నెదర్లాండ్ మ్యాచ్ నెదర్లాండ్ గెలిచింది. గ్రూప్ స్టేజీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి నమీబియా, నెదర్లాండ్ రెండేసి పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి.

Story first published: Monday, October 17, 2022, 12:00 [IST]
Other articles published on Oct 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+