
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ బిలో ఐర్లాండ్ తో తలపడుతున్న వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కింగ్, చార్లెస్, ఒడియన్ స్మీత్ రాణించడంతో వెస్టిండీస్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. మ్యాచ్ అధ్యంతం ఐర్లాండ్ బౌలర్లను ఎదుర్కొవడంలో కరేబియాన్ ఆటగాళ్లు విఫలమ్యయారు. బంతిని బౌండరీ తరలించడంతో విఫలమయ్యారు.
బ్రాండన్ కింగ్
వెస్టిండీస్ ఆటగాళ్లలో బ్రాండన్ కింగ్ 48 బంతుల్లో ఒక సిక్స్, 6 ఫోర్లతో 62 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జన్సన్ చార్లెస్ 18 బంతుల్లో సిక్స్, 3 ఫోర్లతో 24 పరుగులు చేయగా ఒడియన్ స్మీత్ 19 పరుగలు చేశాడు. మిగతా వారు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో గారెత్ డెలానీ 4 ఓవర్లలో 16 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. సిమి సింగ్, బారీ మెక్‌కార్తీ ఒక్కో వికెట్ తీశారు.

ఎవరు గెలచినా
ఇక గ్రూప్ విషయానికొస్తే ఇందులో వెస్టిండీస్, జింబాంబ్వే, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఉన్నాయి. ఈ నాలుగు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి రెండేసి పాయింట్లతో ఉన్నాయి. వెస్టిండీస్ ఐర్లాండ్ పై విజయం సాధిస్తేనే సూపర్ 12కు వెళ్తుంది. కాగా మరో మ్యాచ్ మధ్యాహ్నం 1: 30 గంటలకు జింబాంబ్వేతో స్కాట్లాండ్ పోటీ పడనుంది. ఇందులో విజయం సాధించిన జట్టు సూపర్ 12కు వెళ్తుంది.