For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆతిథ్య భారత్‌తో ఆడేందుకు వెస్టిండీస్ జట్టు ఖరారు

West Indies recall Warrican and Ambris for India Tests

జమైకా: కొద్ది కాలంగా జట్టుకు దూరమై గాయం నుంచి కోలుకోవడంతో సునీల్ అంబ్రీస్ మళ్లీ వెస్టిండీస్ జట్టులో సభ్యుడైయ్యాడు. ఈ కారణంగానే కొన్ని సిరీస్‌ల విరామం అనంతరం మళ్లీ ఆతిథ్య భారత్‌తో జరిగే టెస్టులో స్థానం దక్కించుకున్నాడు. భారత్‌లో వెస్టిండీస్‌ పర్యటన ఖరారైంది. తాజాగా వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు భారత్‌లో వెస్టిండీస్‌ పర్యటనను ఖరారు చేస్తూ పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ప్రకటించింది.

ఈ పర్యటనలో ఆతిథ్య భారత్‌తో వెస్టిండీస్‌ రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు హైదరాబాద్‌లో జరగనుంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం భారత్‌తో తలపడే జట్టును కూడా వెస్టిండీస్‌ ప్రకటించింది.

'1948 నుంచి ఇప్పటి వరకు భారత్‌-వెస్టిండీస్‌ మధ్య 94 టెస్టులు జరిగాయి. ఇందులో 30 విజయాలు, 28 పరాజయాలు, 46 మ్యాచ్‌లను వెస్టిండీస్‌ డ్రాగా తన ఖాతాలో వేసుకుంది' అని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు అధికారులు తెలిపారు.

'ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో మెరుగ్గా రాణించిన జాసన్‌ హోల్డర్‌ జట్టుకు ముందుగా అభినందనలు. గాయం కారణంగా ఇటీవల కొన్ని సిరీస్‌లకు దూరమైన సునీల్‌ అంబ్రిస్‌తో పాటు జోమెల్‌ వర్రికన్‌ కూడా భారత పర్యటనకు వెళ్లే వెస్టిండీస్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు' అని వారు తెలిపారు.

వెస్టిండీస్‌ జట్టు: జాసన్‌ హోల్డర్‌(కెప్టెన్‌), సునీల్ అంబ్రిస్‌, దేవేంద్ర బిషూ, బ్రాత్‌వైట్‌, రాస్టన్‌ ఛేజ్‌, షేన్‌ డౌరిచ్‌, గాబ్రియల్‌, హమిల్టన్‌, షాయ్‌ హోప్‌, హెట్‌మ్యార్‌, జోసెఫ్‌, కీమో పాల్‌, కీరన్‌ పొవెల్‌, రోచ్‌, వర్రికన్‌.

భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్‌ వివరాలిలా:

మొదటి టెస్టు: రాజ్‌కోట్ - అక్టోబరు 4-8

రెండో టెస్టు: హైదరాబాద్‌ - అక్టోబరు 12-16

తొలి వన్డే - గువాహటి - అక్టోబరు 21

రెండో వన్డే - ఇండోర్‌ - అక్టోబరు 24

మూడో వన్డే - పూణె - అక్టోబరు 27

నాలుగో వన్డే - ముంబయి - అక్టోబరు 29

ఐదో వన్డే - తిరువనంతపురం - నవంబరు 1

తొలి టీ20 - కోల్‌కతా - నవంబరు 4

రెండో టీ20 - లఖ్‌నవూ - నవంబరు 6

మూడో టీ20 - చెన్నై - నవంబరు 11

ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా టెస్టు సిరీస్ ముగించుకుని ఇండియాకు చేరనుంది. అనంతరం సెప్టెంబరు 15 నుంచి 28 యూఏఈ వేదికగా ఆసియా కప్‌లో పాల్గొంటుంది. ఆ తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తలపడేందుకు భారత్‌ సిద్ధం కావాల్సి ఉంది.

Story first published: Thursday, August 30, 2018, 13:18 [IST]
Other articles published on Aug 30, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+