వెస్టిండీస్ వర్సెస్ శ్రీలంక: తేలిపోయిన కరేబియన్ వీరులు: ఎవరు ఓడినా ఇంటిదారే

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో మరో నాకౌట్ మ్యాచ్ ఈ సాయంత్రం మొదలు కానుంది. సూపర్ 12 రౌండ్‌లో గ్రూప్ 2లో వెస్టిండీస్, శ్రీలంక తలపడుతున్నాయి. అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియం దీనికి వేదికగా మారింది. సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభమౌతుంది. రెండు జట్లకూ అగ్నిపరీక్ష లాంటి మ్యాచ్ ఇది. ఓడిన జట్లు ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. నాలుగు మ్యాచ్‌లల్లో ఒకదాంట్లో మాత్రమే గెలిచిన శ్రీలంక.. మూడు మ్యాచ్‌లల్లో ఒక దాంట్లోనే నెగ్గిన విండీస్ తలపనున్నాయి.

బ్యాటింగ్ బలంగా ఉన్నా..
వెస్టిండీస్‌లో బ్యాటింగ్ లైనప్ చూడ్డానికి అద్భుతంగా ఉంది. ఆల్‌రౌండర్లతో నిండిపోయింది. ఎవాన్ లెవిస్, క్రిస్ గేల్, నికొలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయిర్, కీరన్ పొల్లార్డ్, జేసన్ హోల్డర్, ఆండ్రీ రస్సెల్.. ఇలా అందరూ బౌలర్ల దుమ్ము దులిపే వారే. గ్రౌండ్‌లో దిగేటప్పటికి నీరసించి పోతున్నారు. చెత్త షాట్లను ఆడుతున్నారు. షాట్ సెలక్షన్ కూడా రావట్లేదు. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గుర్తుండి పోయేలా ఆడట్లేదు కరేబియన్ కింగ్స్. కొత్తగా క్రికెట్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది వారి బ్యాటింగ్ తీరు.

బౌలింగ్ కూడా అంతే..
శ్రీలంకతో సహా మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లోనూ భారీ తేడాతో గెలిస్తే.. తప్ప టోర్నమెంట్‌లో ముందకు వెళ్లలేని పరిస్థితిలో ఉంది విండీస్. రవి రాంపాల్, డ్వేన్ బ్రావో, ఆండ్రీ రస్సెల్ ఉన్నా బౌలింగ్ లయ తప్పుతోంది. బ్యాటర్లపై ఒత్తిడిని తీసుకుని రాలేకపోతున్నారు. ఫలితంగా ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడిని తీసుకుని రాలేకపోతోందీ టీమ్. అలవోకగా పరుగులను ధారదాత్తం చేస్తోంది.

తీసికట్టుగానే లంకేయులు..
శ్రీలంక జట్టు పరిస్థితి బాగుందనుకోవడానికీ ఏ మాత్రం వీల్లేదు. వెస్టిండీస్‌కు భిన్నంగా ఏమీ ఉండట్లేదు. టీ20 ప్రపంచకప్ ఆడుతున్న కొత్త ముఖాలే అధికం. సీనియర్ బ్యాటర్లు ఎవరూ పెద్దగా లేరు. అనుభవం ఉన్న వాళ్లు అంతంత మాత్రమే. వారికి సరైన దిశను చూపించే అనుభవజ్ఞుడు లంకేయుల్లో లేరు. బ్యాటింగ్‌లో పాథుమ్ నిశ్శంక, చరిత్ అసలంక, భానుక రాజపక్ష ఫర్వాలేదనిపించుకున్నారు. బౌలింగ్ మీదే ఆధారపడుతోంది శ్రీలంక టీమ్. వనిందు హసరంగ సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే బెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడతను. 14 వికెట్లను పడగొట్టాడు.

రెండు జట్లు ఇవే..
వెస్టిండీస్ తుది జట్టులో ఎవాన్ లెవిస్, క్రిస్ గేల్, రోస్టన్ ఛేజ్, నికొలస్ పూరన్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయిర్, డ్వేన్ బ్రావో, జేసన్ హోల్డర్, కీరన్ పొల్లార్డ్, రవి రాంపాల్, ఆండ్రీ రస్సెల్, అకీల్ హొస్సెయిన్ ఆడనున్నారు. లంకేయుల్లో కుశాల్ పెరీరా, పాథుమ్ నిశ్శంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్ష, డాసన్ శనక, చమిక కరుణరత్నె, దుష్మంత చమీర, మహీష్ తీక్షణ, వనిందు హసరంగ, లహిరు కుమార ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications