ఆసలు కారణమిదీ: విశాఖ వన్డేలో విండిస్ ఆటగాళ్ల చేతికి నల్ల బ్యాడ్జిలు

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా టీమిండియాతో బుధవారం జరగనున్న రెండో వన్డేలో వెస్టిండిస్ ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాడ్జిలు ధరించి ఆడనున్నారు. విండీస్ మాజీ క్రికెటర్ బాసిల్ బుచర్ (86 ఏళ్లు) మృతికి సంతాపంగా బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
దీనిపై టీమ్ మేనేజర్ ఫిలిప్ స్ఫూనర్ మాట్లాడుతూ "వెస్టిండీస్ గొప్ప క్రికెటర్లలో బాసిల్ బుచర్ ఒకరు. సర్ గ్యారీ సోబర్స్, రోహన్ కన్హై, క్లైవ్ లాయిడ్ యొక్క సహచరుడు కూడా. ఈ రోజు తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. గౌరవ చిహ్నంగా వెస్టిండీస్ జట్టు రెండో వన్డేలో చేతికి నల్ల బ్యాడ్జిలను ధరించనుంది" అని పేర్కొన్నారు.

గుయానాకు చెందిన బాసిల్ బుచర్
గుయానాకు చెందిన బాసిల్ బుచర్ ఇండియాపై అరంగేట్రం చేశారు. 1969 వరకు వెస్టిండిస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఆయన 44 టెస్టులు ఆడాడు. ఆ జట్టు తరుపున 43.11 యావరేజితో 7 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో బాసిల్ బుచర్ అత్యధిక స్కోరు 209.

తన అరంగేట్రం సిరిస్‌లో భారత్‌పై
తన అరంగేట్రం సిరిస్‌లో భారత్‌పై 486 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1963లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 133 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత 1965లో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్టుల్లో అత్యధిక స్కోరు(209) నమోదు చేశాడు.

విశాఖపట్నంలో టీమిండియాకు మంచి రికార్డు
ఇదిలా ఉంటే, రెండో వన్డే జరుగుతున్న విశాఖపట్నంలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకూ విశాఖపట్నంలో ఆడిన తొమ్మిది వన్డేల్లో టీమిండియా ఆరింట విజయం సాధించి, ఒక దాంట్లో ఓడింది. ఆ ఓటమి కూడా విండీస్ చేతిలోనే ఎదురైంది. ఒక మ్యాచ్ టై అవగా.. మరొకటి రద్దు అయింది.

సిరిస్‌పై కన్నేసిన వెస్టిండిస్
ఇక్కడ చివరగా జరిగిన వన్డే టైగా ముగిసింది. భారీ స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్‌లో టీమిండియా, వెస్టిండిస్ సరిగ్గా చెరో 321 పరుగులు చేశాయి. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా జరుగుతున్న ఈ రెండో వన్డేలో టీమిండియా గెలిస్తేనే సిరిస్ బరిలో నిలుస్తుంది. తొలి వన్డే గెలిచిన ఊపులో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని విండీస్ చూస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications