కరేబియన్ల సంబరంగా మారిన ఐపీఎల్ (ఫోటోలు)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇది ఇండియాళ్ల సంబంరం అంటూ టీవీల్లో ఊదరగొట్టేస్తున్నారు. ఐపీఎల్ ఆటగాళ్లు ఆడుతున్న ఆటతీరుని చూస్తుంటే, ఇది ఇండియా వాళ్ల సంబంరం కంటే కరేబియన్ల సంబంరం అంటే బాగుంటుదేమో అని అనిపించింది.
2012లో ట్వంటీ20 వరల్డ్ కప్‌ను సాధించి పరిమిత ఓవర్ల క్రికెట్లో తమకు ఎవరూ సాటి లేరిని ఈ కరేబియన్లు సత్తా చాటారు. ఐపీఎల్ 8వ ఎడిషన్ ప్రారంభానికి ముందు ఆస్టేలియా ఆటగాళ్లు అభిమానులను అలరిస్తారని అంచనా వేశారు. కానీ టోర్నీ ప్రారంభమైన తర్వాత వెస్టిండిస్‌కు చెందిన అద్భుతమైన ప్రదర్శనతో మ్యాచ్ విన్నర్లుగా మారుతున్నారు.

క్రిస్ గేల్
గంగ్నమ్ డ్యాన్స్‌కు బాగా పాపులారిటీ వచ్చింది క్రిస్ గేల్ వల్లే. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరుపున క్రిస్ గేల్ ఆడుతున్నాడు. క్రీజులో ఉన్నంతసేపు పరుగుల సునామీనే. ఐపీఎల్‌లో గేల్ మొత్తం 5 సెంచరీలు నమోదు చేశాడు. ఇప్పటి వరకు గేల్ ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో 46.25 సగటుతో 370 పరుగుల చేశాడు.

డ్వేన్ స్మిత్
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. టోర్నమెంట్ ప్రారంభంలో చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరో ఓపెనర్ మెక్ కల్లమ్‌తో కలిసి మంచి భాగస్వామ్యాలను నెలకొల్పుతున్నాడు. దీని వల్ల తర్వాత వచ్చే ధోనీ, రైనా, డుప్లెసిస్, బ్రావో లాంటి బ్యాట్స్‌మన్ తమ సహజసిద్ధమైన ఆటతీరును ప్రదర్శించే అవకాశం దక్కుతోంది. స్మిత్ ఆడిన 12 మ్యాచ్‌ల్లో 25.58 సగటుతో మొత్తం 307 పరుగులు సాధించాడు.

డ్వేన్ బ్రావో
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడు. బ్యాటింగ్‌లో ఇప్పటి వరకు 158 పరుగులు చేసినా, బౌలింగ్‌తో చక్కగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ టోర్నీలో 19 వికెట్లను తీసుకుని, ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌కిచ్చే పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. మైదానంలో తన డ్యాన్స్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. మొత్తం 12 మ్యాచ్‌ల్లో 31.6 సగటుతో 158 పరుగులు చేశాడు. 19 వికెట్లు తీసుకుని టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు.

ఆండ్రీ రస్సెల్
వెస్టిండిస్ జట్టులో ఉన్న ఆల్ రౌండర్లలో ఆండ్రీ రస్సెల్ ఒకడు. ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. గౌతమ్ గంభీర్ (288 పరుగులు), రాబిన్ ఊతప్ప (325) పరుగులతో ముందున్నా పా యింట్ల పట్టికలో కోల్‌కతాను రెండో స్థానంలో నిలబెట్టిన ఘనత మాత్రం రస్సెల్‌దే. ఎన్నోసార్లు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆండ్రీ రస్సెల్ 11 మ్యాచ్‌ల్లో 41.0 సగటులో 287 పరుగులు చేశాడు. 11 వికెట్లు తీసుకున్నాడు.

లెండిల్ సిమన్స్
ఐపీఎల్ టోర్నమంట్ ఆరంభంలో అంతగా అవకాశాలు దక్కకపోయినా, ఆ తర్వాత ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ చక్కని ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. ఓపె నర్‌గా పార్థివ్ పటేల్‌తో కలసి ముంబై ఇండియన్స్‌కు మంచి భాగస్వామ్యాలను అందిస్తున్నాడు. సిమన్స్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 43.12 సగటుతో మొత్తం 345 పరుగులు చేశాడు.
ఐపీఎల్ అంటే ఒక్క వ్యక్తి గురించి తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిందే. అతనే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకి చెందిన క్రిస్ గేల్. క్రిస్ గేల్ క్రీజులో ఉన్నంత సేపు స్టేడియంలో పరుగుల సునామీనే. మే 6న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై క్రిస్ గేల్ సాధించిన సెంచరీ ఐపీఎల్ టోర్నమెంట్లో అత్యుత్తమ సెంచరీల్లో ఒకటి.
ఇప్పటి వరకు క్రిస్ గేల్ ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో 46.25 సగటుతో 370 పరుగుల చేశాడు. ఐపీఎల్‌లో అటు బ్యాటుతోనే కాకుండా తన డ్యాన్స్‌తో స్డేడియానికి వచ్చిన అభిమానులను ఊర్రూతలూగిస్తుంటాడు వెస్టిండిస్‌కు చెందిన మరో ఆటగాడు డ్వేన్ బ్రావో. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications