భారత్‌తో రెండో టెస్టు.. బ్రాత్‌వైట్ బౌలింగ్‌పై ఫిర్యాదు

దుబాయ్: వెస్టిండీస్ పార్ట్ టైమ్ బౌలర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ బౌలింగ్ యాక్షన్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి మరోసారి ఫిర్యాదు అందింది. గత సోమవారం భారత్‌తో ముగిసిన రెండో టెస్టులో బ్రాత్‌వైట్ అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్‌కు పాల్పడినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. బ్రాత్‌వైట్ బౌలింగ్ యాక్షన్‌పై ఐసీసీకి ఫిర్యాదు అందడం ఇది రెండోసారి.

ఐసీసీకి ఫిర్యాదు:
భారత్‌తో ముగిసిన రెండో టెస్టులో బ్రాత్‌వైట్ బౌలింగ్ చేశాడు. అయితే అతని బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు లోబడి లేదని ఫీల్డ్ అంపైర్లు గుర్తించి ఐసీసీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు విండీస్ బోర్డు మేనేజ్‌మెంట్‌కు కూడా సమాచారం అందించారు. ఫిర్యాదు తీసుకున్న ఐసీసీ.. ఈ నెల 14లోపు బ్రాత్‌వైట్ తన బౌలింగ్ యాక్షన్‌కు సంబంధించి పరీక్షలకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే అప్పటివరకూ బ్రాత్‌వైట్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన బౌలింగ్ కొనసాగించడానికి ఐసీసీ అనుమతి ఇచ్చింది.

గతంలో కూడా ఫిర్యాదు:
ఇంతకుముందు కూడా బ్రాత్‌వైట్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదులు వచ్చాయి. 2017 ఆగస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అతని బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని ఫీల్డ్ అంపైర్లు ఫిర్యాదు చేశారు. కాగా అప్పట్లో పరీక్షలు నిర్వహించిన ఐసీసీ.. నెల తర్వాత అతనికి క్లీన్‌చీట్ ఇచ్చింది. దీంతో బ్రాత్‌వైట్ మళ్లీ బౌలింగ్ చేస్తున్నాడు. మరి ఈసారి ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. బ్రాత్‌వైట్ రెగ్యులర్ బౌలర్ కాదు. ఓపెనర్‌గా పేరొందిన ఈ ఆటగాడిని విండీస్ కెప్టెన్ అప్పుడప్పుడు ఉపయోగించుకుంటాడు.

సిరీస్ క్లీన్‌స్వీప్:
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 257 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తద్వారా కరేబియన్ దీవుల్లో తొలిసారి టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఘనతను సాధించింది. రెండో టెస్టులో సెంచరీ (111), అర్ధ సెంచరీ (53)తో సత్తా చాటిన తెలుగు తేజం హనుమ విహారి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గా ఎంపికయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications